కాటన్ బ్యారేజి నుంచి డెల్టాలకు సాగునీరు విడుదలకు శ్రీకారం

0 26

_కాటన్ బ్యారేజ్ నుంచి డెల్టా కాలువలకు సాగునీటిని విడుదల చేసిన ఎంపీ, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ మార్గాని భరత్ రామ్
_ముహూర్తం మేరకు బ్యారేజ్ పై స్విచ్ ఆన్ చేసి కాల్వలకు నీటి విడుదల
_మొదటిసారిగా పోలవరం స్పిల్ వే మీదుగా గోదావరి డెల్టా లకు సాగునీరు
_ఎంపీ వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ భరత్ రామ్

 

రాజమహేంద్రవరం ముచ్చట్లు:

 

- Advertisement -

మొట్ట మొదటిసారిగా ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే మీదుగా విడుదలైన గోదావరి జలాలను డెల్టాలకు సాగునీటిని విడుదల చేయడం విశేష సంతరించుకుంది. సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్ నుంచి ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మూడు డెల్టా లకు సాగునీటిని ముహూర్తం ప్రకారం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఈస్ట్రన్ డెల్టా ఆర్మీ వద్ద స్విచ్ ఆన్ చేసి  మంగళవారం రాజమహేంద్రవరం ఎంపీ, వై ఎస్ ఆర్ సి పి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ నీటి విడుదల ప్రక్రియను ఇరిగేషన్ అధికారుల సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్‌విప్ మార్గాని భరత్ రామ్ ఈస్ట్రన్ ఆర్మ్ వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆర్మ్ స్విచ్ ఆన్ చేసి 1000 క్యూసెక్కుల గోదావరి జలాలను  విడుదల చేశారు. తదుపరి బ్యారేజీ ఆర్మూర్ లను పరిశీలించి నీటి విడుదల ను పర్యవేక్షించారు. ఇరిగేషన్ అధికారులతో ఖరీఫ్ సీజన్ నీటి అవసరాలు, బ్యారేజ్ నీటి పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు.

 

 

 

ఈ సందర్భంగా ఎంపీ భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి నుంచి ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సెంట్రల్ డెల్టా,  వెస్ట్రన్ డెల్టా, ఈస్త్రన్ డెల్టాలకు 4000 వేల క్యూసెక్కుల గోదావరి జలాల విడుదల తో ప్రారంభం చేయడం జరిగిందని చెప్పారు.
పోలవరం 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కాపర్ డ్యామ్‌ను ఎన్నికల స్టంట్ గా వినియోగించుకుని మసిపూసి మారేడు కాయ చేశారని విమర్శించారు.ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పోలవరం వద్ద 20 టీఎంసీల స్టోరేజీని పెట్టడం జరిగిందని చెప్పారు.  వచ్చే సీజన్ కి పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పూర్తి చేసి గోదావరి జలాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం జరుగుతుందని చెప్పారు.
దివంగత మహానేత వైయస్సార్ మానస పుత్రిక అయిన పోలవరం ప్రాజెక్టును  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సాగునీటితో సస్యశ్యామలం చేయడం జరుగుతుందని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ కూడా పోలవరం పెండింగ్ నిధులపై సానుకూలంగా స్పందిస్తోందన్నారు.

 

 

 

త్వరలో ఆర్ అండ్ ఆర్ కి సంబంధించిన నిధులు కూడా విడుదల కానున్నాయి అని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్క ఎకరానికి సాగునీరు ఇబ్బంది లేకుండా గౌరవ ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో సాగునీటిని అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా దేశంలోనే రికార్డు స్థాయిలో సంక్షేమాన్ని అందించడం జరుగుతుంది అని చెప్పారు. ఈ సందర్భంగా గోదావరి డెల్టా చీఫ్ ఇంజనీర్ పుల్లారావు, ఎస్ఈ శ్రీరామకృష్ణ, హెడ్ వర్క్స్  ఈఈ శ్రీనివాస రావు, రాజమండ్రి రూరల్ వై ఎస్ ఆర్ సి పి కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, రాష్ట్ర నాయకులు గిరిజాల బాబు, రావిపాటి రామచంద్ర రావు, జిల్లా టెలికం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ లక్ష్మీ సుజాత, ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ కొత్త విజయ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: Initiation of irrigation discharge from Cotton Barrage to deltas

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page