కామారెడ్డి జిల్లా కేంద్రానికి నూతన విద్యాసంస్థలు వచ్చేంత వరకు పోరాటం చేస్తాం విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ

0 11

కామారెడ్డి ముచ్చట్లు:

కామారెడ్డి జిల్లా కేంద్రానికి నూతన విద్యాసంస్థలు వచ్చేంత వరకు పోరాటం చేస్తాం అని టిఎన్ఎస్ఎఫ్
విజెఎస్,ఎన్ఎస్ యుఐ,బిసి విద్యార్ధి సంఘం,ఎస్ఎఫ్ఐబిసి యువజన సంఘాలు తీర్మానించాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జిల్లా విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. గతంలో కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా కామారెడ్డి జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలని, జిల్లా కు మెడికల్ కళాశాల లతోపాటు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటిఐ కళాశాలను ఏర్పాటు చేయాలని, అరోరా ఇంజనీరింగ్ కళాశాల భవనం జివిఎస్ కళాశాల భవనం, బీఎడ్ కళాశాల భవనం నిరుపయోగంగా ఉన్నాయని వీటిలో నూతన విద్యా సంస్థలను ఏర్పాటు చేసినట్లయితే కామారెడ్డి జిల్లా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థి సంఘాల నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పర్యటన లో భాగంగా నూతన విద్యాసంస్థల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేకపోతే విద్యార్థి సంఘాలన్నీ ఐక్యంగా ఉద్యమిస్తామన్నారు . ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి కుంభాల లక్ష్మణ్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, ఎన్ఎస్ యూఐ జిల్లా ఉపాధ్యక్షుడు సుధీర్, ఎన్ఎస్  యూఐ సీనియర్ నాయకులు షేక్ ముక్తార్, బిసి యువజన సంఘం జిల్లా
అధ్యక్షుడు స్వామి, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు అరుణ్, పట్టణ కార్యదర్శి మణికంఠ, టిఎన్ఎస్ఎఫ్ జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్ ఆకుల శివకృష్ణ, శ్రీకాంత్ రాజు, సతీష్, సందీప్ తదితరులు  పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:We will fight till new educational institutions come to Kamareddy district center
United Action Committee of Student Unions

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page