జర్నలిస్టులకు కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు చెల్లించాలి  – టిజేఏ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని

0 20

భువనగిరిముచ్చట్లు:

ఎంతో కాలంగా వివిధ పత్రికలు మీడియా సంస్థలలో పనిచేస్తున్న విలేకరులకు కనీస వేతన చట్టం ప్రకారమైనా జీతాలు ఇచ్చి వేలాది మంది విలేకరుల జీవితాలలో వెలుగులు నిండేలా ప్రభుత్వం చొరవ చూపాలని    తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని డిమాండ్ చేశారు. వివిధ పత్రికలు మీడియాలలో కాంట్రిబ్యూటర్లు, స్ట్రింగర్లు ఇంకా ఇతర ఉద్యోగాల పేర గ్రామీణ పట్టణ జర్నలిస్టులు ఎన్నో కష్ట నష్టాల కోరుస్తూ జీవనం కొనసాగిస్తున్నారని వారందరికి జీతాలు సరికదా జీవనం సైతం కొడిగట్టి పోయే పరిస్థితులు ఉన్నాయని కాబట్టి  జర్నలిస్టులందరికి  కనీసం కనీస వేతన చట్టం ప్రకారమైన జీతాలు ఇచ్చి వారికి జీవితాలకు  భద్రత కల్పించాలన్నారు.  ఇట్టి విషయంలో ఆయా పత్రికలు మరియు మీడియా యాజమాన్యాలపై ప్రభుత్వం వత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -

తెలంగాణ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి అతి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు దానికోసం ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసినట్లు పురుషోత్తం తెలియ చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా సంఘాన్ని విస్తృత పరుస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గాన్ని ఆయన నేడు ప్రకటించారు. జిల్లా సీనియర్ పాత్రికేయులతో ఈ కార్యవర్గాన్ని కూర్చినట్లు పురుషోత్తం ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడుగా స్నేహ టీవీ జిల్లా స్టాఫ్ రిపోర్టర్  శ్రీ దొంత సత్యంను, సీనియర్ పాత్రికేయులు  శ్రీ రాగి చంద్రశేఖర్, శ్రీ పోచం సోమయ్య, శ్రీమతి గొర్రె౦కల మంజుల , శ్రీ కటుకమోజు నర్సింహాచారి లను ఉపాధ్యక్షులుగా  ప్రధాన కార్యదర్శిగా దిడ్డికాడి రాము ను, సంయుక్త కార్యదర్శులుగా శ్రీ    గుర్రాల నాగరాజు , శ్రీ మచ్చ రమేష్ ను  కోశాధికారిగా  గుర్రం నర్సింలు కార్యవర్గ సభ్యులుగా శ్రీ బూడిద గణేష్, శ్రీ చిట్యాల రాజును నియమించినట్లు ఆయన తెలిపారు. నూతన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వీరి నాయకత్వంలో జిల్లా జర్నలిస్టు ఉద్యమానికి ఊపిరి పోసినట్లయ్యిందని అంతే కాకుండా ఈ జిల్లా కార్యవర్గ ప్రకటనతో టిజేఏ మరియు దాని మాతృ సంస్థ అయిన నేషనల్ జర్నలిస్టు యూనియన్ (ఎన్.యు.జే(ఐ) బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని పురుషోత్తం నారగౌని వ్యక్తం చేశారు. నూతన కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. తామంతా కృషి చేసి జిల్లాలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Journalists must be paid salaries according to the Minimum Wage Act
– TJA State President Purushottam Nargauni

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page