జిపి నిధుల దుర్వినియోగం పై ప్రత్యేక అధికారిచే విచారణ జరిపించాలి

0 13

బాధ్యులపై, అధికారులపై, దొంగ రికార్డుల సృష్టికర్తలపై చర్యలు తీసుకోండి

జిల్లా కలెక్టర్ కు చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి

- Advertisement -

జగిత్యాల ముచ్చట్లు:

జిల్లాలోని నూతన మండల కేంద్రమైన బుగ్గారం గ్రామపంచాయతీ  నిధుల దుర్వినియోగం
పై ప్రత్యేక అధికారిని నియమించి తగు విచారణ చేపట్టి ప్రజా ధనాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ కు బుగ్గారం గ్రామ అభివృద్ది కమిటీ చైర్మన్  తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి చేశారు.మంగళవారం
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక వినతిపత్రం అందజేసిన ఆయన మంగళవారం విలేఖరులతో మాట్లాడారు.
బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం అనే అభియోగం పై 2020 సెప్టెంబర్ 17న డిఎల్పీవో ప్రభాకర్ విచారణ చేపట్టారని అన్నారు. అట్టి విచారణ నివేదిక ఆధారంగా 2020 నవంబర్ 27న జారీ చేసిన షోకాజ్ నోటీసులపై నేటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా, అలసత్వంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, తప్పుడు రికార్డులు, దొంగ రికార్డులు, దొంగ బిల్లుల తయారీకి అవకాశం ఇస్తున్న
జిల్లా పంచాయతీ అధికారి నరేష్, పాత డిపివో వేముల శేఖర్, డివిజనల్ పంచాయతీ అధికారి ప్రభాకర్ లతో పాటు, దొంగ రికార్డుల, దొంగ బిల్లుల సృష్టికర్తల పై బాధ్యులైన ఇతరులపై కూడా చర్యలు తీసుకోవాలని చుక్క గంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను కోరారు.
బుగ్గారం గ్రామ పంచాయతీ లో దాదాపు 30 లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం అయినట్లు ఆయన ఆరోపించారు. ఇదంతా అధికారులకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కేవలం రూ.16,14,585 లకు మాత్రమే షోకాజ్ నోటీసులు జారీ చేశారని అన్నారు. ఏడు నెలలు గడుస్తున్నా ఆ షోకాజ్ నోటీసులపై కూడా నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది చే తప్పుడు, దొంగ రికార్డులు, దొంగ బిల్లులు తయారు చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన డివిజనల్, జిల్లా స్థాయి పంచాయతీ ఉన్నతాధికారులు కూడా ఇలాంటి అవినీతి – అక్రమాలను, నిధుల దుర్వినియోగాన్ని, దొంగ, తప్పుడు రికార్డులను ప్రోత్సహించడం, వారికి సహకరించడం చాలా బాధాకరం అన్నారు. ఇది క్షమించరాని నేరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకేనేమో మండల, డివిజనల్, జిల్లా స్థాయి పంచాయతీ అధికారులు కూడా సమాచార హక్కు చట్టం – 2005 ద్వారా దరఖాస్తులు పెట్టినా గత ఏడాది కాలంగా సమాచారం ఇవ్వకుండా సతాయిస్తూ ప్రభుత్వ చట్టాలను కూడా అధికారులు ఉల్లంఘించారని చుక్క గంగారెడ్డి ఆరోపించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల నుండి అనగా 2019-20, 2020-21 లెక్కలు కూడా ఇంకా ఆడిట్ చేయించలేదని  ఆడిట్ అధికారులు సమాచారం ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. నేటికీ కూడా యధేచ్చగా పాలకులు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ప్రత్యేక అధికారిని నియమించి బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం పై తగు పకడ్బందీ విచారణ చేపట్టి నిధుల దుర్వినియోగం పై,  బాధ్యులపై, అవినీతి – అక్రమాలను, నిధుల దుర్వినియోగాన్ని ప్రోత్సహించిన అధికారులపై, తప్పుడు, దొంగ రికార్డుల సృష్టి కర్తలపై, బాద్యులైన ఇతర వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం తగు చర్యలు చేపట్టాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ ను చుక్క గంగారెడ్డి కోరారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:The misappropriation of GP funds should be investigated by a special officer

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page