జూనియర్ కళాశాలలో అడ్మిషన్ పత్రాలు ఆవిష్కరించిన శాసన సభాపతి పోచారం

0 9

కామారెడ్డి ముచ్చట్లు:

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నూతనంగా ఏర్పడిన బీర్కూర్ జూనియర్ కళాశాల యొక్క అడ్మిషన్స్ కరపత్రాలను తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తెలంగాణ తిరుమల దేవస్థానం తిమ్మాపూర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ అకడమిక్ ఇయర్లో నూతనంగా ఏర్పాటైన ఒకే ఒక్క జూనియర్ కళాశాల మన బీర్కుర్ మండలానికి వచ్చిందని కావున మండలంలోని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి కోరికమేరకు సి ఈ సి , హెచ్ ఇ సి , ఎం పి హెచ్ డబ్ల్యు కోర్సులను జూనియర్ కళాశాలకు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘు , మండల జెడ్ పి టి సి స్వరూప, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం , తెరాస పార్టీ ప్రెసిడెంట్ వీరేశం, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గంగారం, కో ఆప్షన్ సభ్యులు ఆరిఫ్, కళాశాల జూనియర్ అసిస్టెంట్ అబ్దుల్ రజాక్ పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Legislative Speaker Pocharam unveils admission papers in Junior College

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page