ఢిల్లీకి ఏపీ గవర్నర్ పిలుపు

0 27

న్యూఢిల్లీ  ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రఘురామ కృష్ణంరాజు-ఏపీ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న వివాదం వంటి అంశాల నేపథ్యంలో గవర్నర్‌కు ఢిల్లీ నుంచి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోవిడ్ నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి చాలా రోజులైంది.రెండ్రోజుల క్రితమే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లి పలువురు కేంద్రమంత్రులను కలిసి వచ్చారు. రాష్ట్రానికి చేరుకున్న అనంతరం ఆయన గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్‌‌తోనూ భేటీ అయ్యారు. అయితే ఆకస్మాతుగా గవర్నర్‌కు హస్తిన నుంచి పిలుపు రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ వెళ్లనున్న గవర్నర్ ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనూ భేటీ అవుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

- Advertisement -

Tags:AP Governor calls on Delhi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page