తెలంగాణలో ఏకైక బాహుబలి కేసీఆర్ కడియం శ్రీహరి

0 17

వరంగల్ ముచ్చట్లు:
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ఈటెల రాజేందర్ లోని కమ్యూనిస్టు చనిపోయాడా? ఈటెల సిద్ధాంతాలు, భావజాలం, వామపక్ష లక్షణాలు ఏమయ్యాయి. రాజకీయ మనుగడ కోసం, కేసుల నుండి తప్పించుకోవడానికి, ఆస్తులను కాపాడుకోవడం కోసం మాత్రమే ఈటెల బీజేపీలో చేరారని అయన అన్నారు. . తెలంగాణ రాష్ట్రానికి అనేక విధాలుగా నష్టం చేసిన బీజేపీలో ఈటెల రాజేందర్ ఎలా చేరాడు? బీజేపీలో ఈటెల రాజేందర్ కు సముచిత గౌరవం దక్కేలా లేదు.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో బీజేపీలో చేరుతాడని అనుకున్నాం.  రాచరికపు, ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతినిధిగా ఈటెల రాజేందర్ ఉన్నాడు. ఫ్యూడల్ కు ఉండాలిసిన భావాలు, ఆస్తులు ఈటెల రాజేందర్ వద్ద ఉన్నాయి.  స్వతంత్ర అభ్యర్థిగా ఉంటే ఈటెల రాజేందర్ ను హుజురాబాద్ ప్రజలు ఆశీర్వదించేవారు కావచ్చు. పోరాటం చేయకుండా పారిపోయి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారు.  బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ.  కులాల వారిగా, మాతలా వారిగా జాతిని విభజించే పార్టీ బీజేపీఅని అయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక బాహుబలి కేసీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ క్రమేపీ కనుమరుగు అవుతుంది. ఎమ్మెల్యేగా గెలువనోడు కూడా ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. కాంగ్రెస్ లో ఒకరంటే మరొకరికి పడదు. బీజేపీకి పోరాటాలు చేసిన చరిత్ర లేదని అయన అన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

- Advertisement -

Tags:KCR is the only Bahubali in Telangana
Kadium Srihari

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page