తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మృతి

0 15

బేతంచర్ల ముచ్చట్లు:

 

బేతంచర్ల మండలం హెచ్.  కొట్టాల గ్రామానికి చెందిన అశోక్ టి. డి. పి మండల కన్వీనర్ గా సేవలు అందిస్తున్నాడు. ఈయన  అనారోగ్యం కారణంగా చాలా రోజుల నుండి బాధపడుతూ మంగళవారం నాడు మృతిచెందాడు ఈయన మృతి పట్ల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కే. యి కుటుంబం   బేతంచర్ల మండల టిడిపి నాయకులు దిగ్భ్రాంతి చెందారు.   ఈయన టిడిపిలో చాలాకాలంగా కార్యకర్తగా సేవలందిస్తూ తన ప్రతిభను చాటాడు ఆయన సేవలకు మెచ్చి టి. డి. పి బేతంచర్ల మండల కన్వీనర్ గా హోదాని ఇచ్చింది. ఈయన టి. డి. పిలో చాలా చురుకుగా పాల్గొనేవాడు తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి టిడిపి గెలుపుకు పాటుపడిన వ్యక్తి ఈయన మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని పలువురు నాయకులు కొనియాడారు.  ఈ నెంబర్ కి తో బేతంచర్ల అశోక్ మృతిని టి. డి. పి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు ఈయన భౌతిక కాయాన్ని చూడడానికి మండల ప్రజలు తండోప తండాలుగా తరలి వస్తున్నారు.  ఈయన బౌతిక కాయాన్ని ప్రముఖ టిడిపి నాయకులు సందర్శించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Telugudesam party constituency convener dies

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page