థర్డ్ వేవ్ హెచ్చరిక నేపథ్యంలో నివారణకు రాష్ట్రప్రభుత్వం ముందోస్తు ప్రణాళిక…

0 15

అమరావతి ముచ్చట్లు:

 

రాష్ట్రములో థర్డ్ వేవ్ హెచ్చరిక నేపథ్యంలో నివారణకు ముందోస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం పీడియాట్రిక్ అంశాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు.మంగళగిరి ఏపిఐఐసి భవనం 6ఫ్లోర్ లోని కాన్ఫరెన్స్ హల్ లో మంగళవారం కోవిడ్ నివారణ గ్రూప్ అఫ్ మిమిస్టర్స్ సమావేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కమిటీ కన్వీనర్ ఆళ్ల నాని అధ్యక్షతన జరిగింది.పాల్గొన్న సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి,కురసాల కన్నబాబు, రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి, డాక్టర్ సిదిరి అప్పలరాజు, పలువురు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు.జనావాసాలకు దగ్గరిగా ఉండేలా హెల్త్ హాబ్ లు ఏర్పాటు చేయాలని సిఎం నిర్ణయం.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో చిన్నారులకు వైద్య చికిత్స సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకోవాలి.ఆరోగ్య శ్రీ అత్యుత్తమ ఆరోగ్య పధకంగా నిలవాలని సిఎం సంకల్పం.వ్యాక్సిన్ మరింతగా వేగవంతం చేయాలని 5సంవత్సరాల లోపు తల్లులకు టీకా వేసే కార్యక్రమం ముమ్మరం చేయాలి.

 

 

 

 

- Advertisement -

ఆరోగ్య శ్రీ పధకం ద్వారా అందిస్తున్న వైద్య సేవలు పూర్తిగా ఉచితం.థర్డ్ వేవ్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అదేశం.ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్ ముందుగానే పరిశీలించి అవకాశం ఉన్న చోట పిల్లలకు చికిత్స అందించడానికి ఏర్పాట్లు.థర్డ్ వేవ్ లో అవసరమైన అన్ని రకాలు మందులు అందుబాటులో ఉంచుకోవాలి.అర్హులైన తల్లులకు ఒక రోజు ముందుగానే వ్యాక్సిన్ టోకెన్స్ పంపిణికి ఏర్పాట్లు చేయాలి.బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన వారికి అన్ని హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందించడానికి ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలి.ఇంజక్షన్స్ బ్లాక్ మార్కెట్ లో విక్రయాలు జరిగితే కఠినంగా వ్యవహారించాలి.కరోనా కేసులు తగ్గు ముఖం పట్టిన అప్రమత్తంగా ఉండాలని కమిటీ సూచన.ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2వేలకు పై బడి బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు.చిన్న పిల్లలుకు వైద్యం అందించడానికి అదనంగా వైద్యులు, సిబ్బంది నియామకానికి చర్యలు.అన్ని హాస్పిటల్స్ లో బెడ్స్ అందుబాటులో ఉంచాలి.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: The state government has come up with a precautionary measure in the wake of the Third Wave warning …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page