పల్లె ప్రగతి పెండింగ్ పనులు ఈనెల 19 లోపు పూర్తి చేయాలి

0 16

అలసత్వం వహిస్తే సెక్రటరీ లపై కఠిన చర్యలు….
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
పల్లె ప్రగతి పనులపై సమీక్ష సమావేశం……

అసిఫాబాద్ ముచ్చట్లు:

- Advertisement -

జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పంచాయతీలలో చేపట్టిన పనులు ఈ నెల 19 లోపు పూర్తి చేయాలని, పంచాయతీ సెక్రటరీలు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి గార్డెన్ లో మంగళవారం ఉదయం ఆసిఫాబాద్ డివిజన్ ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు, మధ్యాహ్నం కాగజ్ నగర్ డివిజన్ ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రెటరీ లతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి లో భాగంగా పంచాయతీలలో చేపట్టిన నర్సరీలు, సగ్రగేశన్  షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికల్లో పెండింగ్ లో ఉన్న పనులు ఈ నెల 19 లోపు పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మండలాల వారీగా గత ఆరు నెలల క్రితమే పంచాయతీ సెక్రెటరీ లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదన్నారు. జిల్లాలో కొన్ని పంచాయతీల్లో పల్లె ప్రగతి పనులు అధ్వానంగా ఉన్నాయని తీరు మార్చుకోకపోతే పంచాయతీ సెక్రెటరీ లపై వేటు తప్పదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రితో పాటు, ప్రిన్సిపల్ సెక్రెటరీ, చీఫ్ సెక్రటరీలు పల్లె ప్రగతి పనుల పర్యవేక్షణకు జిల్లాకు వచ్చే అవకాశం ఉందని ప్రతి పంచాయతీ లో పనులు పూర్తి కావాలన్నారు. పంచాయతీ సెక్రటరీలు ప్రతిరోజు ఆయా మండలాల ఎంపీఓలకు రోజువారీగా చేసే కార్యక్రమాల వివరాలు అందించాలన్నారు. ఇప్పటికే దీనికోసం మూడు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పంచాయతీ సెక్రటరీలు తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం 6 గంటల వరకు తాము చేసిన చేయబోయే పనులు అందులో పోస్ట్ చేయాలన్నారు. మండలాల ఎంపీడీవోలు ప్రతిరోజు టూర్ డైరీ నిర్వహించుకోవాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా  పల్లె ప్రకృతి వనాలకు సంబంధించి రెవెన్యూ, అటవీ భూములు అందుబాటులో లేకుంటే పంచాయతీ నిధుల నుండి భూములు కొనుగోలు చేయాలని తెలిపారు.

పల్లె ప్రకృతి వనం లో 100 శాతం మొక్కలు బతికేలా చూడాలన్నారు. ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వీటిపై శిక్షణ కార్యక్రమాలు ఇచ్చినప్పటికీ కొన్ని చోట్ల మొక్కలు పెట్టకపోవడం, కొన్ని చోట్ల పెరగకపోవడం పై అసహనం వ్యక్తం చేశారు. పనిచేయడం ఇష్టం లేకుంటే రాజీనామా చేయాలని పంచాయతీ సెక్రటరీ లను హెచ్చరించారు. సమావేశానికి ఆలస్యంగా వచ్చినా కొంతమందిపై తీవ్రంగా మండిపడ్డారు. స్మశాన వాటిక లకు కొన్నిచోట్ల కంచె లేదని వాటికి చుట్టూ మొక్కలు నాటి గ్రీన్ ఫెన్సింగ్ వేయాలన్నారు. పల్లె ప్రగతి అభివృద్ధి పనుల పై పంచాయతీ సెక్రెటరీ లకు సర్పంచులకు కనీస అవగాహన లేకపోవడం పై అసహనం వ్యక్తం చేశారు. సగ్రగేశన్ షెడ్డు లో కంపోస్ట్ ఎరువులు తయారు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 20వ తారీకు నుండి పల్లె ప్రగతి పనులు ఆకస్మికంగా తనిఖీ చేస్తానని ఎక్కడైనా అధికారులు అలసత్వం వహిస్తే సంబంధిత సెక్రెటరీ ఎంపీడీవో పై చర్యలు తీసుకుంటామని పంచాయతీ సెక్రెటరీ లను తొలగిస్తామని హెచ్చరించారు. అంతకుముందు జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం మాట్లాడుతూ పంచాయతీలను శుభ్రంగా ఆరోగ్యంగా అభివృద్ధి పరంగా చేసే బాధ్యత సెక్రెటరీ లపై ఉందన్నారు. పంచాయతీ సెక్రటరీలు విధిగా ఆరు గంటలకు పంచాయతీ లో ఉండాలని, ఎంపీవోలు 6:15 నిమిషాలకు విధుల్లోకి రావాలన్నారు. స్థానికంగా సెక్రటరీలు అందుబాటులో ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి భావించారని దాని ప్రకారం ప్రతి పంచాయతీకి ఒక సెక్రటరీ ని కేటాయించారని గుర్తు చేశారు. పంచాయతీకి అందుబాటులో ఉండని సెక్రెటరీ కి హాజరు ఆధారంగా జీతం అందించనున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా పంచాయతీల అభివృద్ధి కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని తెలిపారు. పంచాయతీలలో సెక్రటరీలు ఎంతో ముఖ్యమైన వారని ప్రతి పనిని బాధ్యతగా చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి రవికృష్ణ, ఆసిఫాబాద్ ఆర్డిఓ దత్తు, జిల్లా పరిషత్ సీఈవో రత్నమాల డిఎల్పిఓ రమేష్, అన్ని మండలాల ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రెటరీ లో పాల్గొన్నారు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Rural development pending works should be completed within 19th of this month

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page