పుంగనూరులో రూ.57 కోట్లతో జిక్సిన్‌ సిలిండర్ల పరిశ్రమ- మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌ల కృషి ఫలితం

0 892

– ఏటా 7.20 లక్షల సిలిండర్ల తయారీ

 

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

మూడు దశాబ్ధాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోని పుంగనూరు నియోజకవర్గంలో రూ.57 కోట్లతో జిక్సిన్‌ కంపెనీ సిలిండర్లు, బ్యాటరీల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిలు కలసి పుంగనూరు పారిశ్రామికాభివృద్ధి చెందేందుకు శ్రీకారం చుట్టారు.

 

కంపెనీ ఏర్పాటు….

 

పుంగనూరు మండలం మిట్టచింతవారిపల్లె (ఎంసి.పల్లె)లో ఎపిఐఐసి ద్వారా పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు 27 ఎకరాల భూమిని కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ పెట్రోలీయం, న్యాచురల్‌ గ్యాస్‌ కార్పోరేషన్‌ (ఎంఎన్‌ఓపి), కేంద్ర రక్షణశాఖ (ఎంఓడి) , భారీపరిశ్రమలశాఖ (ఎం.హెచ్‌.ఐ అండ్‌ పి.ఈ)లను రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖమంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట పార్లమెంటు సభ్యులు, లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌ పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి సమన్వయపరచి, అనుమతులు మంజూరు చేయించారు. మండలంలో ఏర్పాటు చేయనున్న జిక్సిన్‌, సిలిండర్లు, బ్యాటరీలు హై స్కీల్డ్ ఎల్‌.పి.జి -హాట్‌ రిపేర్‌ వంటగ్యాస్‌ సిలిండర్ల ఏటా 7.20 లక్షల సిలిండర్లను తయారు చేయనున్నారు. అలాగే 125 ఎండబ్యూ/హెచ్‌ఆర్‌ లిథియం-అయాన్‌ సెల్స్బ్యాటరీ తయారీ పరిశ్రమను కూడ ఏర్పాటు చేయనున్నారు. జిక్సిన్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ విజయవాడ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాహుల్‌కరణం ఆధ్వర్యంలో పుంగనూరులో జిక్సిన్‌ పరిశ్రమ విస్తరించనున్నది. జూలై వెహోదటి వారంలో పనులు ప్రారంభించనున్నారు.

ఉపాధి, వినియోగం….

 

మండలం ఎంసి.పల్లెలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల ద్వారా సుమారు 750 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే వీటితో పాటు లీయాన్‌ పరిశోధన ,అభివృద్ధి (ఆర్‌అండ్‌ డి) ద్వారా 150 మంది సాంకేతిక నైపుణ్యం కలిగిన యువతకు ఉప్యాధి లభించనున్నది. ఇప్పటికే జిక్సిన్‌ కంపెనీ వారు పట్టణంలో ఆర్‌అండ్‌డి ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమలో లి•యం -అయాన్‌ బ్యాటరీలు /సెల్స్ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ సెల్స్ను , బ్యాటరీలు భారత రక్షణశాఖకు చెందిన అనుబంధ విభాగాలలోని ప్రైవేటు సెక్టార్లలో గల ఆటోవెహోబైల్‌ విభాగాలలో ఎలక్ట్రికల్‌ టూవిలర్‌, ఎలక్ట్రికల్‌ ఆటోలు, స్టోరేజ్‌ విభాగాలలో వినియోగించనున్నారు. అలాగే ఆంధప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ ర్ఖా•లకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (ఐవోసీఎల్‌ ) భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (బిపిసిఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పిసిఎల్‌) , మరియు ప్రైవేటు సంస్థలైన సూపర్‌గ్యాస్‌ , మలభార్‌గ్యాస్‌, ఎంవిఆర్‌ గ్యాస్‌ సంస్థల యొక్క ఎల్‌పిజి బాట్లింగ్‌ ప్లాంట్లకు కూడ సిలిండర్లను సరఫరా చేయనున్నారు.

జగనన్నతోనే అభివృద్ధి…

ఎన్నికల సమయంలో మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామిలు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతోనే నేరవేరుతున్నాయి. దశాబ్ధాలుగా అభివృద్ధికి నోచుకోని పుంగనూరులో ఆర్టీసి డిపో, బైపాస్‌రోడ్డును ఏర్పాటు చేశాం. అలాగే ఉర్ధూ, వెటర్నరీ, అగ్రీకల్చర్‌ , పాలిటెక్నిక్‌ కళాశాలు మంజూరు చేయించడం జరిగింది. తమకు వెన్నంటి ఉన్న ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడు పని చేస్తాం.

– రాజంపేట ఎంపి, పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి.

 

Tags:Jixin‌ cylinders and batteries industry in Punganur with Rs 57 crore

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page