పూచీకత్తు లేకుండానే ఎస్సీలకు రుణాలు లివ్వాలి మాల మహానాడు జాతీయ, రాష్ట్ర అధ్యక్షుల డిమాండ్

0 4

జగిత్యాల ముచ్చట్లు:

రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ వర్గాలలోని నిరుపేదలకు రుణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహిస్తోందని,వారికి ఎలాంటి పూచీకత్తులను అడగకుండానే రుణాలను ఇవ్వాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి రవిలు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా స్వర్గీయ నాయకుడు ముద్దం ప్రకాశ్ కు నివాళులు అర్పించిన ,అనంతరం మంగళవారం ప్రెస్ క్లబ్ లో ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్ ల ద్వారా రుణ సౌకర్యం కల్పించేందుకు ఇంటర్వ్యూ లను నిర్వహిస్తోందన్నారు. బ్యాంకర్లు పూచీకత్తు లేనిదే రుణాలను ఇవ్వడం లేదని ఎలాంటి హామీలను అడగకుండానే రుణాలను ఇస్తే నిరుపేద ఎస్సీలకు న్యాయం జరుగుతుందని చెన్నయ్య, రవిలు అన్నారు. అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ సక్రమంగా అమలు కావాలంటే కేటాయించిన బడ్జెట్ ను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులను వినియోగిస్తే సబ్ ప్లాన్ కు న్యాయం జరుగుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి, ఉపాదక్షులు నర్రా శేఖర్, కార్యదర్శి చింతకుంట్ల గంగాధర్, జిల్లా మీడియా ఇంచార్జ్ నీరటి గంగాధర్, పట్టణ అధ్యక్షులు కమలాకర్, కోశాధికారి అంజయ్య, గ్రామ అధ్యక్షులు లక్ష్మీ నర్సయ్య, నాయకులు వెంకటేష్, రవి, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Loans should be made to SCs without collateral
Mala Mahanadu Demand of National and State Presidents

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page