పెంచిన ఆస్తి పన్నులను వెంటనే తగ్గించాలి- మాజీ ఎమ్మెల్యే పాశం డిమాండ్

0 19

నెల్లూరు ముచ్చట్లు:

పెంచిన ఆస్తి పన్నులను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం గూడూరు పట్టణంలోని, రిటైర్డ్ ఉద్యోగుల భవనం నందు సీపీఐ పట్టణ కార్యదర్శి షేక్ కాలేషా అధ్యక్షతన అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా  గూడూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాశం సునిల్ కుమార్ మాట్లాడుతూ కరోనా కారణంగా ప్రజల ఆర్థిక స్థితి దిగజారి పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో పన్నులు పెంచడం ఎంతవరకు సబబని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలపై భారం మోపే నిర్ణయంగా విమర్శించారు. పెంచిన పన్నులు వెంటనే తగ్గించకపోతే ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఆస్తి ఆధారిత పన్ను, చెత్తపై పన్నులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని  డిమాండ్‌ చేశారు.  కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన ప్రజలపై  పన్నులు పెంచటం దారుణమన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబరు 197, 198లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.సీపీఐ పట్టణ కార్యదర్శి కాలేషా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడకపోతే ప్రజల నుంచి గుణపాఠం తప్పదని హెచ్ఛరించారు.

 

 

 

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, చెత్త పన్నులు  రద్దు చేయాలి డిమాండ్ చేశారు.నిత్యావసర వస్తువులు ధరలును కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించాలి అని కోరారు.పెట్రోల్ , డీజల్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా వసూలు చేస్తున్న పనులు రద్దు చేసి , ధరలు తగ్గించాలి, అని అఖిలపక్షం తరుపున హెచ్చరిస్తున్నాం అన్నారు.బీఎస్పీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ నాసిన భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు అయిన పరిశ్రమలు మరియు విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటికరణ రద్దు చేయాలి కోరారు.ప్రభుత్వ ఆస్తుల విక్రయాలను నిలుపదల చేయాలి డిమాండ్ చేశారు.గూడూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరిమళ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రఆదాయం పెంచేమార్గాలుఅన్వేషించకుండా, కేవలం సంక్షేమ పతకాలు పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ, కరోనా సమయంలో కూడా ప్రజలను ఆదుకోకుండా, అనేక విధాలైన పన్నులు విధించడాన్ని ఖండిస్తున్నాం అన్నారు.

 

 

 

 

బీజేపీ పట్టణ అధ్యక్షుడు చెంచు రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్ లు, పరిశ్రమలు స్థాపించి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మార్గాలు అన్వేషించి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు చంద్రయ్య, గూడూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి తాతపూడి ఇస్రాయెల్ కుమార్,  ఏపీ ప్రజా సంఘాల అద్యక్షులు ఎల్ .వి సుబ్బయ్య,  ఏపీ ప్రజా సంఘాల ఐక్య కార్యచరణ పోరాట సమితి  సభ్యులు కె ఆర్ దాసరి, కుల సంఘాల నాయకులు, తెలుగుదేశం పార్టీ పట్టణ బీసీ  సెల్ నాయకులు శివ ప్రసాద్ గౌడ్, దయాకర్, పట్టణ ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ , చిల్లకూరు మండల ఎస్టీ సెల్ అద్యక్షుడు కుడుమల గోపాల్, కార్ స్టాండ్ ,ఆటో స్టాండ్ యూనియన్ సభ్యులు, ఎన్టిఆర్ కాంప్లెక్స్ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: Increased property taxes should be reduced immediately- Former MLA Pasham demand

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page