పెన్షనర్లకు పీఆర్సీ పై వివరణలు

0 4

జగిత్యాల  ముచ్చట్లు:

 

పెన్షనర్లకు పీఆర్సీపై వివిధ విషయాల్లో తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్  వివరించారు. మంగళవారం జిల్లా సంఘ కార్యాలయం లో ఆయన మాట్లాడారు.ఇంతవరకు లైఫ్ సర్టిఫికెట్స్ ఇవ్వని పెన్షనర్లు ఈనెల చివరి వరకు ఇవ్వగలరని సూచించారు. కొత్త పి.ఆర్.సి. ననుసరించి రావలసిన జీవోలు  వెలువడ్డాయన్నారు.
కొత్త  పెన్షన్ వచ్చే నెలలో తీసుకునే అవకాశం ఉందని,  బేసిక్ పెన్షన్ తో పాటు  7.28% డియర్ నెస్ రిలీఫ్ కూడా కలిపి వస్తుందన్నారు. మెడికల్ అలవెన్స్ పి ఆర్ సి రిపోర్ట్ ప్రకారం రూ. 600లు  గా ఉంటుందన్నారు. జూన్ 2018 వరకు రిటైర్ అయినవారికి ట్రెజరీ అధికారులే కొత్త బేసిక్ పెన్షన్ నిర్ధారిస్తారని,  దీనికొరకు వారు ఎలాంటి అప్లికేషను ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
జూలై, 2018  ఆ తర్వాత రిటైర్ అయినవారు –  రిటైర్ అయిన సంస్థ నుండి పే ఫిక్సేషన్ చేయించుకొని,  రివైజ్డ్ పెన్షన్ ఫారములు నింపి,  పెన్షన్ మంజూరు అధికారులకు పంపించు కోవాలి. వారి నుండి రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ట్రెజరీ అధికారులు  దానికనుగుణంగా పెన్షన్ మంజూరు చేస్తారని,

 

 

 

- Advertisement -

70 సంవత్సరములు వయస్సు నిండిన వారికి 15 శాతం అడిషనల్ క్వాంటం పెన్షన్ ట్రెజరీ అధికారులు మంజూరు చేస్తారని, దీనికొరకు ఎలాంటి అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని,
అదేవిధంగా గా  పెన్షన్ నుండి కమ్యూటేషన్ చేసిన మొత్తము –  వారు కమ్యూట్ చేసిన తేదీ నుండి సరిగ్గా 15 సంవత్సరాలకు తిరిగి వేతనంలో కలుపుతారని దీనికి కూడా ఎలాంటి అప్లికేషన్ ఇవ్వనక్కరలేదని పెన్షనర్ల సమాచారార్థం   హరి అశోక్  కుమార్  కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాతం,అలిశెట్టి ఈశ్వరయ్య, ప్రకాష్ రావ్,యాకుబ్, నారాయణ, సత్యనారాయణ, పబ్బా శివానందం, దొంతుల లక్ష్మీ కాంతం,బోబ్బాటి కరుణ,తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Explanations on PRC for Pensioners

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page