పేదరికంలో ఉన్న వారిని ఆదుకోవడ మే బ్రాహ్మణత్వం

0 18

కాకినాడ  ముచ్చట్లు:
కరోనా కారణంగా గత ఏడాది మార్చి నెల నుంచి పురోహితం కోరే పురో హితులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వo గానీ, ప్రైవేటు సంస్థలు సంస్థలు గానీ పట్టించుకోలేదు. దేవాదాయ శాఖ వీరిని గుర్తించలేదు. ఇలాంటి నేపథ్యంలో ఈ ఒక్క నెలలోనే మూడుసార్లు దాతల సహకారంతో కాకినాడ ఇంద్రపాలెం సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కన పిండప్రదానాలు చేసే పురోహితులకు దాతల సహకారంతో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధి డి హెచ్ వి సాంబశివరావు బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులను అందజేశారు. హైదరా బాద్ కు చెందిన కె వి ఎల్ నారాయణ సౌజన్యంతో మరోసారి వీరికి నిత్యవసర వస్తువులు సమకూర్చారు. ప్రముఖ సామాజిక సేవ కార్యకర్త నులుకుర్తి వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ అర్చకులు దత్తు చేతులమీదుగా వీరికి అందజేశారు .దక్షిణ సమర్పించారు. జిల్లావ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పురోహితులు అందర్నీ ఆదుకుని వారి ద్వారా పురోహితం కోరుకుంటామని సాంబశివరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో జె సత్యనారాయణ, పుట్టకొండ  దేవస్థానం ఈవో వడ్డాది సత్తిబాబు, బ్రాహ్మణ సంఘాల నాయకులు అల్లంరాజు బాబీ, చక్రవర్తుల వేణు, గోవర్ధనం శేషాచార్యులు, ఖండవల్లి హనుమంతరావు, చాగంటిపాటి అబ్బు తదితరులు పాల్గొన్నారు. కె వి ఎల్ నారాయణ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

- Advertisement -

Tags:May Brahmanism support those in poverty

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page