పోతులప్పకు ప్రత్యేక పూజలు

0 7

పత్తికొండ  ముచ్చట్లు:

పత్తికొండ పట్టణములోని కాలనీలో కొండపైన వెలసిన విగ్రహాలకు కాలనీ వాసులతో పాటు సర్పంచ్ కొమ్ము దీపిక, మాజీ మండల అధ్యక్షురాలు నాగరత్నమ్మ ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం 10 గంటల 45 నిమిషాల నుంచి 11 గంటల 20 నిమిషాల వరకు నిర్వహించిన పూజలకు కాలనీవాసులు తరలివచ్చి వైభవంగా పూజలు చేశారు. కాలనీలోని నెలకొన్న తాగునీరు, సిసి రోడ్లు, మురికి కాలువల సమస్యలను తీర్చాలంటూ పూజలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్, మాజీ మండల అధ్యక్షురాలు నాగరత్నమ్మ మాట్లాడుతూ కాలనీవాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరానికి కృషి చేస్తామనీ హామీ ఇవ్వడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మేజర్ పంచాయతీ కార్యదర్శి కృష్ణ కుమార్, మాజీ సర్పంచ్ సోమశేఖర్, పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, సుంకన్న, వేణుగోపాల్, చెన్నకేశవులు, పాల భాష పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Special pujas for Potulappa

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page