ప్రజలపై పన్నుల బాదుడు విరమించుకోవాలి సీపీఐ డిమాండ్.    

0 16

డోన్  ముచ్చట్లు:
ప్రజల పై పన్నుల బాదుడు విరమిచుకోవాలి అనీ డోన్ నియోజకవర్గ సీపీఐ ప్రధాన కార్యదర్శి రంగా నాయుడు డిమైండ్ చేసారు, స్థానిక డోన్ పట్టణంలో 10,11 సచివాలయలలో ఈ ధర్నా నిర్వహించారు, ఈ రంగా నాయుడు మాట్లాడుతూ
కరోన విపత్కర పరిస్థితుల్లో ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం పన్నుల బాదుడుకు సిద్ధమవ్వడం చాలా దుర్మార్గపు చర్య మంగళవారం  సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక 10/11 వార్డు సచివాలయం ముందు ఆందోళన చేపట్టారు.అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సుంకయ్య, పట్టణ కార్యదర్శి నక్కిశ్రీకాంత్  లు మాట్లాడుతూ కరోన మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేస్తున్న ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాము కరోన కట్టడి పట్ల నిమ్మకునిరెత్తినట్లు వ్యవహరిస్తూ ఆస్తి పన్నులు పెంచుతూ పేదలపై మరో బాదుడుకు సిద్ధమవ్వడం సిగ్గు చేటు కలిగిస్తుందని వారన్నారు పట్టణ ప్రజలు పై ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్నులు పెంచడం, చెత్త పన్ను కేటగిరీలుగా పెంచడం, మంచి నీటి చార్జీలు, యూజర్ చార్జీలు పెంచేందుకు పావులు కదుపుతోంది. పారిశుద్ధ్య నిర్వహణ నుండి పూర్తిగా తప్పుకొంటుచెత్తపై పన్ను వేయడం తగదు, ఇప్పటికే పలు మునిసిపాలిటీ లు, కార్పొరేషన్ లలో పన్నులను పెంచుతూ తీర్మానాలు చేయడాని రాజకీయ పార్టీలు గా ఖండిస్తున్నాము అన్నారు.

 

కోవిడ్ లాక్ డౌన్,వల్ల ఉపాధి లేక ప్రజలు అల్లాడుతూ పన్నులు, వడ్డీలు రద్దు చేయమని అడుగుతుంటే ఉన్న పన్నులను మరింత పెంచడం దుర్మార్గం, ఏరు దాటాక తెప్ప తగాలేసినట్లు గా స్థానిక ఎన్నికలు పూర్తియ్యాక పట్టణ ప్రజలపై పన్నుల భారాలు మేపడం వైస్సార్ ప్రభుత్వ కప్పదాటు వైఖరికి నిదర్శనం, మునిసిపాలిటీ లలో రూ,60,స్పెషల్ మునిసిపాలిటీ లలో రూ.90,కార్పొరేషన్ లలో రూ.120చొప్పున ప్రతి కుటుంబానికి పెంచుతూ నోటీసులు జారీ చేయడం దారుణం, రాష్ట్రంలోదాదాపు 50 లక్షల కుటుంబాలపై ఏడాదికి రూ.750నుంచిరూ.1450వరకు పెరిగిన పన్నుల భారం పడుతుంది, మునిసిపల్ ఎన్నికల్లో వైస్సార్ ప్రభుత్వ ని అధిక గెలిపించిన ప్రజలకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చే బహుమతి పన్నుల భారమా?అని ప్రశ్నించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి పెంచిన ఆస్తి పన్ను పెంపు దల జీ వో లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు లేని యెడల ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఐక్యఉద్యమాల నిర్వహించి ఈ ప్రభుత్వానికి ప్రజా కోర్టులో తగ్గిన బుద్ది చెప్పుతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శు ప్రభాకర్,మా బాషా ఏ ఐ యస్ ఎఫ్, వ్యవసాయ కార్మిక సంఘాము, ఏఐటీయూసీ,  నాయకులు, శివన్న,నారాయణ , అబ్బాస్,సీపీఐ నాయకులు ,వెంకటేష్,బాషా,దస్తగిరి,నజీర్,శేఖర్,అల్లబకాష్,సూర్య చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:The tax on the people should be abolished
CPI demand.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page