బీసీలకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. బీసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గాజుల నాగరాజు

0 14

జగిత్యాల ముచ్చట్లు:

2014 సంవత్సరం నుండి 2020 సంవత్సరం వరకు అధికారంలో కొనసాగుతున్న తెరసా  ప్రభుత్వం నేటి వరకు 65% జనాభా ఉన్న బీసీలకు ఎలాంటి స్వయం ఉపాధి పొందడానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్  వెనుకబడిన వర్గాల వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా ఇంతవరకు ఎలాంటి సబ్సిడీ రుణాలు ఇచ్చిన దాఖలాలు లేవుని బీసి సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు గాజుల నాగరాజు ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  బీసీ వర్గాలపై తెరాస  ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతుందని ,బీసీ నిరుద్యోగులను అణచివేతకు గురి చేస్తూ ఎలాంటి స్వయం ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పారు.ఇట్టి విషయాన్ని సమస్త బీసీ వర్గాల ప్రజలు ప్రభుత్వం బీసీలపై చూపుతున్న మొండి వైఖరి ని గమనించాలని ఆయన అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ క్రీడలు చూసే ఒక బీసీ నాయకుడిని బొంద పెట్టడానికి ఇంకో బిసి నాయకునికి ఉపాధి అవకాశం ఇస్తూ బీసీలను ఎదగకుండా పూర్తిగా అణచివేతకు గురి చేస్తున్న విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సోదరులకు వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు కొరకు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారే తప్ప వారికి రుణాలు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు.వివిధ బ్యాంకు సంబంధించిన
బ్యాంక్ మేనేజర్ల పలు అవరోధాలు కల్పిస్తూ సబ్సిడీ రుణాలు ఇవ్వడంలో మొండి వైఖరి అవలంబిస్తున్నారన్నారు. ఎస్సీ ,ఎస్టీలకు వెంటనే పూర్తి సబ్సిడీ రుణాలు ఇవ్వాలని , అలాగే రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ప్రజలైన బీసీల పరిస్థితి లను గమనంలోకి తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే స్పందించి, బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ చిన్న పరిశ్రమలు నెలకొల్పు కోవడానికి పూర్తి సబ్సిడీతో ఎలాంటి బ్యాంకు కన్ సెంట్ లేకుండా 20 లక్షల రుణాలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం పక్షణ ఆయన డిమాండ్ చేశారు.అలాగే బీసీ రాజకీయ నిరుద్యోగులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం కాదు,బీసీ పక్షణ చిత్తశుద్ధి ఉంటే బీసీలకు తక్షణమే రుణాలు ఇవ్వాలని ఆయన కొరారు.ఒక బలమైన బీసీ నాయకుని పై అసత్య ఆరోపణలతో రాత్రికి రాత్రే మంత్రిగా బర్తరఫ్ చేసి అతనికి అణచివేసి అతని భవిష్యత్తును అంధకారం లోకి నెట్టి, రాజకీయంగా బొంద పెట్టి ఇంకో పార్టీ నుండి ఇంకో బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుని పార్టీలోకి తీసుకొని ఎమ్మెల్సీ ఇవ్వడంలో ఉన్న శ్రద్ధ బడుగు, బలహీన వర్గాల సబ్సిడీ రుణాలు ఇవ్వడంలో ఎందుకు లేదని బీసీల పక్షణ ప్రశ్నిస్తున్నామని ఆన్నారు. బీసీల హక్కులను కాలరాసే ప్రభుత్వాన్ని కాలగర్భంలో కలిపే రోజు త్వరలో వస్తుందని ప్రభుత్వానికి సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శులు ఓరుగంటి భార్గవ్ రామ్, ఆకుల నాగరాజు, సిరిపురం మహేందర్, జిల్లా ప్రచార కార్యదర్శి కౌడు వెంకటి, బాలె వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Subsidized loans should be given to BCs.
BC Welfare Society District President Glass Nagraj

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page