మినీ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

0 8

హైదరాబాద్ ముచ్చట్లు:
అల్లాపూర్ 116 డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ లో మినీ ఫంక్షన్ హాల్ ను కూకట్ పల్లి  ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు మంగళవారం ప్రారంభించారు.   ఈ సందర్బంగా కార్పొరేటర్  సబిహా బేగం మాట్లాడుతూ పర్వత్ నగర్ లో మినీ ఫంక్షన్ హాల్ ప్రారంభం కావడం చాలా సంతోషం గా ఉంది, గత కొంత కాలంగా ఈ మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం  కోసం ఎమ్మెల్యే కృష్ణారావు గారు చేసిన సహాయసహకారాలు మారువలేనివి, అలాగే తెరాస ప్రభుత్వం యొక్క నాయకత్వం లో మేము డివిజన్ ను చాలా అభివృద్ధి చేసుకున్నాం, ఎమ్యెల్యే సహాయసహకారాలు ఎప్పటికి మారువలేనివని అన్నారు.
ఈ మినీ ఫంక్షన్ హల్ పర్వత్ నగర్ తో పాటు డివిజన్ లోని పేద ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ప్రజలు కూడా హర్షం వ్యక్త పరుస్తున్నారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు,మరియు గౌరవ మంత్రివర్యులు కేటిఆర్ గారికి ఎప్పటికి రుణపడి ఉంటాం,అలాగే   ఇంతటి మహోత్తర కార్యం ఎమ్మెల్యే గారి సహాయ సహకరలతోనే ఇది సాధ్యం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్, బస్తి నాయకులు,కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, ఏరియా సభా సభ్యులు, తదితరులు పాల్గోన్నారు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

- Advertisement -

Tags:MLA who inaugurated the Mini Function Hall

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page