మేడిపల్లి ఒపెన్ కాస్ట్ ను సందర్శించిన అధికారులు

0 25

పెద్దపల్లి  ముచ్చట్లు:

సింగరేణి సిపి అండ్ పి జీఎం కె.నాగభూషణ్ రెడ్డి, జీఎం ఎక్స్ ప్లోరేషన్ బి.శ్రీనివాస్ రావు, ఆర్జి 1 జీఎం కె.నారాయణ మేడిపల్లి ఒపెన్ కాస్ట్ ను మంగళవారం సందర్శించారు. క్వారిలోని పని స్థలాల్లో వర్షా కాలంలో ఉత్పత్తి  ఉత్పాదకత, వర్షా కాలంలో ఎటు వంటి చర్యలను తీసుకోవాలో, అటకం కలుగకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయుట, అలాగే క్వారి పనిస్థలలో రక్షణ చర్యలకు సంబందించిన తదితర విషయాల గురించి మ్యాప్ ల ద్వారా పరిశీలించారు. తదనంతరం వ్యూ పాయింట్ వద్దకు వెళ్ళి అక్కడ నుండి క్వారి లోని బెంచ్ లు, బొగ్గు ఉత్పత్తి చేయు ప్రదేశాలు పరిశీలించారు. అలాగే క్వారి చివరి దశ లో ఉన్న కారణంగా  ప్రస్తుత పని స్థలలలో తవ్వకాలకు అనుకూలమైన బొగ్గు నిల్వల పరిస్థితి, ఓవర్ బర్డెన్ తొలగింపు తదితర విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏజిఎం జియోలాజి శివ నారాయణ, మేడిపల్లి పి.ఒ సత్యనారాయణ, మేడిపల్లి మేనేజర్ గోవిందరావు, ఫిట్ ఇంజనీరు   వెంకటేశ్వర్ రావు, సేఫ్టీ ఆఫీసర్  శ్రీనివాస్, సర్వే ఆఫీసర్ అలీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Officials visiting the Madipalli Opencast

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page