రాముడికి భారీ కానుక

0 11

భద్రచాలం ముచ్చట్లు:
భద్రాచలం సీతారామస్వామి వారి ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. శ్రీరామనవమి రోజున భద్రాద్రిలో రాముల వారి కళ్యాణం ఘనంగా జరుగుతుంది. అటువంటి శ్రీరామునికి సీతమ్మకి ఓ దాత అరుదైన కానుక అందించారు. సీతమ్మకు స్వర్ణ కవచంతో కూడిన బంగారు చీర, రామయ్యకు బంగారు పాదాల్ని బహూకరించారు. భద్రాద్రి దేవస్థానంకు చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 13.50 కిలోల స్వర్ణంతో బెంగళూరుకు చెందిన జేవీ రంగరాజు దంపతులు కుటుంబ సభ్యుల సహకారంతో స్వర్ణ కవచాన్ని తయారు చేయించారుప్రముఖ స్థపతి కోదండపాణి రామయ్య స్వర్ణ భద్రకవచాలను తయారు చేయడం విశేషం.ఇకనుంచీ భద్రాద్రిలో ప్రతి శుక్రవారం రామయ్య స్వర్ణ కవచాలతో బంగారు రామయ్యగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. భద్రాద్రి దేవస్థానం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఇంత భారీస్థాయిలో విరాళాన్ని అందజేసిన దాతలు ఎవ్వరు లేరు. ఇంత పెద్ద మొత్తంలో దేవునికి స్వర్ణకవచ చాలు ఇవ్వడం ఇదే మొదటిసారి. దీంతో ఈ కాను చరిత్రలో నిలిచిపోతుందని అక్కడి పూజారులు చెబుతున్నారు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

- Advertisement -

Tags:A huge gift to Ramu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page