రాష్ట్రంలో ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకోరా..

0 5

– విద్యాసంస్థలు ప్రారంభం కాకుండానే ఫీజుల వసూలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం

– ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నీరటి రామ్ ప్రసాద్

- Advertisement -

పెద్దపల్లి  ముచ్చట్లు:
రాష్ట్రంలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం ఇంకా ఎప్పుడు చర్యలు తీసుకుంటదని నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు నీరటి రామ్ ప్రసాద్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని జీఎం కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఫీజుల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కరోన కష్ట కాలంలో కూడా ఫీజుల దోపిడీ తప్పడంలేదని, అయిన ప్రభుత్వం మొద్దు నిద్ర విడకపోవడం దారుణం అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కూడా కాకుండానే కొన్ని సంస్థలు ఫీజులు చెల్లించాలని ఇప్పటికే ఫోన్ ల ద్వారా తెలిపుతున్నాయని, సగం రోజులు కూడా నడువకుండానే పుర్తి స్థాయిలో ఫీజుల వసూళ్లు చేయడం ఎంత వరకు సమంజసం అన్నారు. చాలా వరకు పాఠశాలలు, కళాశాలలు పూర్తి స్థాయిలో ఫీజులు వసూళ్లు చేసినప్పటికీ ఉపాధ్యాయులకు మాత్రం జీతాలు చెల్లించకుండా వారి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తుందని, ఇలాంటి సంస్థలపై ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ఎన్ఎస్ఎఫ్ అలాంటి సంస్థలకు, వారికి మద్దతుగా నిలుస్తున్న ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్రంలో ఫీజుల నియంత్రణపై దృష్టి పెట్టాలని, అదే విధంగా విద్యా సంస్థలలో పని చేసే సిబ్బందికి జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రఘు, పట్టణ నాయకులు సాయి తరుణ్, మహేష్, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:No action has been taken to control fees in the state.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page