రాష్ట్ర ఎన్నికల కమిషన్ నీలం సాహ్నికి ఏపీ హైకోర్టు నోటీసులు

0 27

అమరావతిముచ్చట్లు:

రాష్ట్ర ఎన్నికల కమిషన్ నీలం సాహ్నికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పైీ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వంతో పాటు, ఇతర ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. కాగా మార్చి 31న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో నీలం సాహ్ని నియామకమయ్యారు. నీలం సాహ్మి ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏప్రిల్ 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించింది.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:AP High Court notices to State Election Commission Neelam Sahni

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page