రేషన్ కార్డుతో మొబైల్ నెంబర్ అనుసంధానానికి లబ్ధిదారులకు తప్పని తిప్పలు

0 26

సిద్దిపేట ముచ్చట్లు:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ఆధార్ కేంద్రాల వద్ద లబ్ధిదారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు రేషన్ కార్డును ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ తో అనుసంధానం చేయించడానికి పడిగాపులు కాస్తున్నారు. మొబైల్ నెంబర్ రేషన్ కార్డుతో అనుసంధానం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐరీష్ విధానాన్ని రేషన్ దుకాణాల్లో సరుకులు తీసుకోవడానికి తీసుకువచ్చిన పట్టణంలోని పలు రేషన్ దుకాణాల లో ఐరిష్ విధానాన్ని రేషన్ డీలర్లు ఉపయోగించడం లేదు. దీంతో రేషన్ బియ్యం తీసుకోవడానికి ఓటీపీ విధానం తీసుకువచ్చి రెండు నెలలు దాటినా ఆధార్ నమోదు కేంద్రాల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతూ పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్రాల వద్ద నిలుచున్న మొబైల్ నంబర్ అనుసంధానం కావడంలేదని వాపోతున్నారు. మరోవైపు కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ఆధార్ కేంద్రాల వద్ద లబ్ధిదారులు గుంపులుగుంపులుగా ఒకే దగ్గర చేరి ఉండడం వ్యాధి వ్యాప్తికి కారణం అవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డుల ద్వారా సరుకులు తీసుకోవడానికి మొబైల్ నెంబర్ ఓటిపి విధానాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం లబ్ధిదారులు నమోదు చేసుకోవడానికి సరైన సదుపాయలు, సౌకర్యాలు కల్పించకపోవడం బాధాకరమని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

- Advertisement -

Tags:Beneficiaries are required to link the mobile number with the ration card

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page