విద్య ద్వారానే సమాజంలో నూతన మార్పులు: ఎమ్మెల్సీ కవిత

0 10

జగిత్యాల ముచ్చట్లు:
విద్య ద్వారానే సమాజంలో నూతన మార్పులు తీసుకు రావడం సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. చదువుతోనే అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, గాంధీ అన్యాయాలపై పోరాడారని గుర్తు చేశారు. జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ చంద్ర శేఖర్ గౌడ్, పాలకవర్గ అభినందన సభలో ఎమ్మెల్సీ పాల్గొని మాట్లాడారు.అనేక పుస్తకాలు చదివిన విజ్ఞానంతో సీఎం కేసీఆర్ తెలంగాణ విముక్తిలో కీలక పాత్ర పోషించారన్నారు.రాష్ట్రంలో పటిష్టమైన లైబ్రరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు అందుబాటులో లైబ్రరీలు ఉంచుతామన్నారు. జగిత్యాలలోని 15 మండలాలలో లైబ్రరీలు ఉన్నాయి. మరో మూడు మండలాలో సైతం ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలో నూతన లైబ్రరీకి త్వరలో కొత్త చైర్మన్ ఆధ్వర్యంలో శంకుస్థాపన జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.అలాగే జగిత్యాలలో ఈ – లైబ్రరీ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. జగిత్యాల లైబ్రరీని మోడల్ లైబ్రరీగా మార్చేందుుక కృషి చేస్తామని హామీనిచ్చారు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

- Advertisement -

Tags:New changes in society through education: Emelsie Poetry

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page