సూర్యపేటలో కల్నల్  విగ్రహం

0 12

నల్గోండ  ముచ్చట్లు:
గతేడాది జరిగిన భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలో వీర మరణం పొందిన ఆర్మీ అధికారి, సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోశ్ బాబు విగ్రహాన్ని మంత్రికేటీఆర్ ఆవిష్కరించారు. సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి కల్నల్‌ సంతోష్‌ బాబు అమ‌రుడైన‌ సంగతి తెలిసిందే. ఆయన విగ్రహాన్ని సూర్యాపేట‌లో కేటీఆర్ ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో సంతోశ్ బాబు 9 అడుగుల‌ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. దీన్ని మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు.లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట గతేడాది జూన్‌ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సంతోశ్ బాబు సహా 20 మంది వరకూ సైనికులు అమరులయ్యారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్‌బాబు వీరోచిత పోరాట స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట గతేడాది జూన్‌ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్‌బాబుతో పాటు మ‌రికొంద‌రు సైనికులు అమరులైన విషయం తెలిసిందే. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్‌బాబు వీరోచిత పోరాట స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.సంతోశ్ బాబు మరణించిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకున్న సంగతి తెలిసిందే. ఆ కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సాయంతో పాటు, బంజారాహిల్స్‌లో ఇంటి స్థలం, సంతోశ్ బాబు సతీమణికి గ్రూపు 1 స్థాయి ఉద్యోగాన్ని సీఎం కేసీఆర్ కల్పించారు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

- Advertisement -

Tags:Colonel statue at Suryapet

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page