హైపర్ ఆది పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి యువ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ  

0 21

ఖమ్మం  ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర ప్రజలు అత్యంత పవిత్రంగా కొలిచే బతుకమ్మ పండుగను, గౌరమ్మ దేవతను, తెలంగాణ యాస, బాషను కించపరుస్తూ స్కిట్ చేసిన హైపర్ ఆది, మల్లెమాల ప్రొడక్షన్ టీమ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని యువతెలంగాణ పార్టీ ఖమ్మం  జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇటీవల ఒక టివి ఛానెల్ ప్రోగ్రాం స్కిట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవమైన బతుకమ్మ పండుగను హేళన చేస్తూ, కించపరుస్తూ స్కిట్ చేయడం హేయమైన చర్య అని, హైపర్ ఆది, మల్లెమాల ప్రొడక్షన్ టీమ్ అందరూ తెలంగాణ ప్రజలకు క్షమాపణ  చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటివి మరోమారు పునరావృతం కాకుండా ఉండాలంటే వీరందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.  ఈ ప్రాంతంలో ఉంటూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరూ మీద ఉందని ఆయన అన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

- Advertisement -

Tags:Strict legal action should be taken against Hyper Sun.
Young Telangana Party district president Jakkula Venkataramana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page