ఆంధ్ర రేషన్ తెలంగాణాకు అక్రమ రవాణా..

0 19

– ప్రభుత్వ స్టిక్కర్లతో ప్యాకింగ్ చేసిన  గన్ని సంచులు
– రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుకున్నదెవరు?.
– రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల విచారణ

 

కుక్కునూరు ముచ్చట్లు:

 

- Advertisement -

ఏపీలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగడంలేదు. పశ్చిమ గోదావరి  జిల్లా, కుక్కునూరు మండల పరిధిలోని ఉప్పేరు గ్రామం నుండి తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురంకు టిఎస్ 28టి 9310 నెంబర్ గల అశోక్ లైలాండ్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం మరియు వాహనాన్ని బూర్గంపాడు మండల కేంద్రంలో  బూర్గంపాడు రెవెన్యూ, పోలీసు అధికారులు   సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఈ కేసులో ఉప్పేరు గ్రామానికి  చెందిన నర్రా వినోద్ కుమార్, అశోక్ లైలాండ్ వాహనం డ్రైవర్ కుచ్చెర్లపాటి విశాల్ ను అదుపులోకి తీసుకోవడంతో పాటుగా అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తున్న అశోక్ లైలాండ్ వాహనాన్ని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సై ఎస్. జితేందర్ వెల్లడించారు. కుక్కునూరు మండలంలోని ఉప్పేరు గ్రామంలో నర్రా వినోద్ కుమార్ తండ్రి భూషణం గిడ్డంగి నుంచి  అశోక్ లైలాండ్ వాహనంలో అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు చేసిన ఈ దాడిలో అశోక్ లైలాండ్ వాహనాన్ని తనిఖీ చేయగా 29.60 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం ఉన్నట్లు తేలిందన్నారు. అందులో  రేషన్ బియ్యం ప్యాకింగ్ చేసిన సంచులకు జిల్లా కోడ్ , బియ్యం రకానికి సంబంధించిన వివరాలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అనే స్టిక్కర్ తో ప్యాకింగ్ చేసి ఉన్న 14 గన్ని సంచుల్లో రేషన్ బియ్యం ఉన్నట్లుగా సివిల్ సప్లై మరియు పోలీసు అధికారులు గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్న 29.60 క్వింటాల రేషన్ బియ్యం విలువ సుమారుగా రూ. 82,880/-

 

 

 

వేలు ఉంటుందన్నారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చే చౌక బియ్యంను ప్రజల వద్ద తక్కువ ధరకు కొని ఇక్కడి గౌడన్‌లో నిల్వ ఉంచి తెలంగాణ  రాష్ట్రానికి తరలిస్తున్నట్లు నిందితులు చెబుతున్నారు. కానీ
ప్రభుత్వం రేషన్ షాపులకు సప్లై చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారా?,
ఏ రేషన్ షాప్ కు సంబంధించిన గన్ని సంచులు? ఒకే షాప్ నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేశారా?, లబ్ధిదారులకు 2020-21 సంవత్సరమునకు సంబంధించి ప్రభుత్వం సప్లై చేసే గన్ని సంచులు రేషన్ షాపులకు కాకుండా లబ్ధిదారులకు ప్రభుత్వం ఎప్పటినుంచి గన్ని సంచులను ఇస్తుంది?, ప్రభుత్వం బియ్యాన్ని మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చినట్లయితే రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులకు రేషన్ బియ్యం ప్యాకింగ్ చేసిన గన్ని సంచుల్లో ఎక్కడినుంచి వచ్చాయి?,
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ స్టిక్కర్లతో ప్యాకింగ్ చేసిన  సంచుల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులకు గన్ని సంచుల్లో రేషన్ ప్యాకింగ్ చేసిన వాటికి జిల్లా కోడ్ బియ్యం రకానికి సంబంధించిన వివరాలు మరియు ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అనే స్టిక్కర్ల తో ప్యాకింగ్ చేసిన 14  గన్ని సంచులు ఏ రేషన్ షాపుకు చెందినయని తెలియాల్సి ఉందని, రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులు లబ్ధిదారుల దగ్గర నుంచి తక్కువ రేటు  కొనుగోలు చేశామని చెబుతున్న వ్యక్తులు  ప్రభుత్వం స్టిక్కర్లతో ప్యాకింగ్ చేసిన బియ్యం బస్తాలను ఏ రేషన్ షాపుల్లో కొనుగోలు చేశారనేది?, రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా ఎప్పటి నుంచి జరుగుతుందనేది తెలియాలని, రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఎవరున్నారనేది అధికారుల విచారణలో తెలాల్సి ఉంది.?

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Andhra ration smuggled to Telangana ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page