ఈటలకు మావోయిస్టుల లేఖ

0 14

హైదరాబాద్   ముచ్చట్లు :

బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటలకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఆయన పేరిట తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఘాటు లేఖ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర మాజీమంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను తెలంగాణ మావోయిస్టు పార్టీ ఖండించింది. ఈటల రాజేందర్ రారాజీనామా చేసి తర్వాత కెసిఆర్ ఫుడల్ పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని… అందుకోసం ఆర్ఎస్ఎస్ నుండి పోరాడాలని ప్రకటన చేశారని మావోలు గుర్తు చేశారు. ఆ ప్రకటన చేసి హిందూత్వ పార్టీ అయినా బిజెపి తీర్థం పుచ్చుకున్నారని ఆరోపించారు.కేసీఆర్, ఈటల మధ్య ఉన్న విభేదాలు ఏ మాత్రం ప్రజలకు సంబంధించినవి కావన్నారు. వారు ఒకే గూటి పక్షులన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. కెసిఆర్ ,ఈటెల రాజేందర్ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తూట్లు పొడిచారని మావోయిస్టు పార్టీలో లేఖలో ప్రస్తావించింది. వీరి పాలన ప్రజా వ్యతిరేకమైనది… సామ్రాజ్యవాద దళారి నిరంకుశ పెట్టుబడిదారీ విధానానికి భూస్వామ్య వర్గాలకు అనుకూలంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల పునర్నిర్మాణం మార్చారని ఆరోపించింది.మొన్నటి వరకు కెసిఆర్ పక్కన అధికారాన్ని అనుభవించిన ఈటెల తన ఆస్తుల పెంపునకు ప్రయత్నించాడని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ లేఖలో ఆరోపించారు. అందులో భాగంగా పేదల భూములను అక్రమంగా ఆక్రమించారన్నాడు. కెసిఆర్ బర్రెలు తినేవాడు అయితే ఈటెల రాజేందర్ గొర్రెలు తినే ఆచరణ కొనసాగించాడన్నారు. తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తాం అని ప్రకటిస్తూ తన ఆస్తుల రక్షణ కోసం నేడు బిజెపిలో చేరారని మావోయిస్టు నేత జగన్ విమర్శించారు.ఆర్ఎస్‌యు మావోయిస్టులు కూడా తనకు మద్దతు ఇస్తారని ఈటల చెప్పుకోవడం పచ్చి మోసంగా మా పార్టీ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తుందన్నారు జగన్. ఈటెల తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణలోని ప్రజలు ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారన్నారు. బీజేపీ హిందూత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా దేశంలో విశాల ప్రజలు ఐక్యమై పోరాడుతున్నారన్నారు. అలాగే కెసిఆర్ నియంత పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడుతున్నారని జగన్ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

భర్తను కొట్టి చంపిన భార్య

 

Tags:Maoist letter to Yates

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page