ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డికి అవకాశం

0 37

కడప ముచ్చట్లు:

జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి దాదాపు ఖరారయింది. రానున్న ఖాళీలలో ఆయన పేరును ఎమ్మెల్సీగా జగన్ ఖరారు చేసే అవకాశముంది. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డికి ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మధ్య సయోధ్య నెలకొనాలంటే ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఒక్కటే మార్గమని జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు జగన్ నుంచి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి హామీ లభించింది.ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నారు. స్థానికసంస్థల కోటా, నామినేటెడ్, ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవులు భర్తీ కానున్నాయి. వీటిలో అత్యధికంగా వైసీపీయే దక్కించుకోనుంది. ఇందులో రామసుబ్బారెడ్డి పేరుకు జగన్ ఇప్పటికే టిక్ పెట్టారంటున్నారు. రామసుబ్బారెడ్డి సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉంది. అయితే ఆయనకు కొన్నేళ్లుగా జమ్మలమడుగులో గెలుపు అవకాశాలు లభించడం లేదు.దీంతో రామసుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. జమ్మలమడుగు నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున టిక్కెట్ ఇచ్చేది లేదని కూడా ఆయనకు పార్టీ అధిష్టానం ఖరాఖండీగా చెప్పేసింది. మరోసారి సుధీర్ రెడ్డికే టిక్కెట్ ఇస్తామని కూడా చెప్పింది. అయితే ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని రామసుబ్బారెడ్డికి పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చింది. నిజానికి రామసుబ్బారెడ్డి కి ఎమ్మెల్సీ పదవి కొత్తేమీ కాదు. గతంలో టీడీపీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది.గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేయడానికి రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరోసారి వైసీపీ నుంచి అదే రకమైన ప్రతిపాదన రావడంతో రామసుబ్బారెడ్డి రాజీపడతారా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రామసుబ్బారెడ్డి అంతకు మించి వేరే ఆప్షన్ లేదంటున్నారు. తెలుగుదేశం పార్టీకి వెళ్లినా ఫలితం ఉండదు. దీంతో రామసుబ్బారెడ్డి రాజీపడక తప్పదని, త్వరలోనే ఎమ్మెల్సీ అవుతారని ఆయన వర్గం నేతలు చెబుతున్నారు.

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Opportunity for Ramasubbareddy as MLC

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page