ఏటీఎం చోరికి విఫలయత్నం

0 9

ఖమ్మం ముచ్చట్లు :
ఖమ్మం జిల్లాలో దుండగులు ఓ ఏటీఎంను కొల్లగొట్టేందుకు ప్రయత్నించి విఫలయత్నం చేశారు. అంతేకాదు, వారు ఆ పని చేసే క్రమం నవ్వు తెప్పిస్తోంది. ఖమ్మం జిల్లా మధిర పట్ణణంలోని ఫ్లైఓవర్ పక్కనే ఉన్న ఓ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఏటీఎంలోని డబ్బును కాజేసేందుకు ఇద్దరు వ్యక్తులు చొరబడ్డారు. కాసేపటికే తేలు కుట్టిన దొంగల్లా ఏమీ తెలియనట్లు బయటికి జారుకున్నారు. అసలేం జరిగిందంటే..మధిర బస్టాండ్‌ సమీపంలోని మెయిన్‌ రోడ్డులో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి కింద ఆ ఏటీఎం ఉంది. ముందస్తు ప్లాన్ ప్రకారం.. ఇద్దరు దొంగలు మాస్కులు ధరించి ఏటీఎంను కొల్లగొట్టేందుకు వచ్చారు. వారితోపాటు వెంట గడ్డపార వంటి ఆయుధాలు తెచ్చుకున్నారు. ఇద్దరు దొంగలు ఏటీఎంలోకి చొరబడి ముందస్తు జాగ్రత్తగా అందులో ఉన్న సీసీటీవీ కెమెరాను పొడుగాటి రాడ్‌తో ధ్వంసం చేసేశాడు. ఇక తమను ఎవరూ చూడడం లేదనుకొని ధైర్యంగా ఏటీఎంను కొల్లగొట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. పలుగుతో ఏటీఎంను కొల్లగొట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు.ఇంతలో దుండగుడి కన్ను ఏటీఎం గదిలోనే ఓ మూలపై పడింది. దీంతో అతను వెంటనే కంగుతిని, నిరుత్సాహపడిపోయాడు. ఎందుకంటే అక్కడ మరో సీసీటీవీ కెమెరా ఉంది. అప్పటిదాకా ఏటీఎంను కొల్లగొట్టేందుకు వారు చేసిన తతంగమంతా ఆ కెమెరాలో రికార్డయింది. దీంతో చేసేది లేక ఏటీఎం కొల్లగొట్టడం విరమించుకొని ఏమీ తెలియనట్లు బయటకు వచ్చేశారు.ఈ విషయం ఏటీఎం నిర్వహకులకు తెలియడంతో వారు ఏటీఎం కేంద్రాన్ని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ కోసం సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. దొంగలు చేసిన విన్యాసాలన్నీ బయటపడ్డాయి

భర్తను కొట్టి చంపిన భార్య

 

- Advertisement -

Tags:Attempted ATM theft

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page