కరోన కట్టడికి ప్రత్యేక చర్యలు- సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

0 64

రామసముద్రం ముచ్చట్లు:

 

ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోన మహమ్మారిని నివారించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. బుధవారం పంచాయతీ పరిధిలోని వనగానిపల్లి గ్రామంలో కరోన నివారణకు మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆదేశాల మేరకు కరోన పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ చూసినా కరోన రక్కసి కోరలు చాపడంతో ప్రజారోగ్యమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అదే బాటలో మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా కూడా ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ కరోన పరీక్షలు నిర్వహించి కరోన మహమ్మారిని నివారిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా వై.కురప్పల్లి గ్రామంలో సుమారు 7మందికి కరోన పరీక్షలు నిర్వహించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, వాలింటర్లు పుష్పావతి, దినకర్, నాయకులు బాబు, ఎల్లారెడ్డి, విటి.జయచంద్ర, శివకుమార్, మునస్వామి, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Special measures for corona building- Sarpanch Srinivasureddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page