కుటుంబ కలహాలతో ఓ ఉద్యోగి ఆత్మహత్య

0 4

హైదరాబాద్  ముచ్చట్లు:

 

ఇంట్లో ఎవరు లేని ఈ సమయంలో లోపలికి వెళ్లి గడియ పెట్టుకొని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివ కాలనీలో సి హెచ్ పవన్ అనే వ్యక్తి  తన  భార్య లిఖిత తో  కలిసి నివసిస్తున్నాడు. పవన్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని జిహెచ్ఎంసి కార్యాలయంలో ని హైటెక్ మిషన్స్ ట్రాన్స్పోర్ట్ సూపర్ వైసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రోజు విధులు నిర్వహించుకొని ఇంట్లోకి వచ్చిన  పవన్ లోపలికి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతసేపటికీ పవన్ బయటికి రాకపోవడంతో కంగారుపడిన తన భార్య లిఖిత పోలీసులకు స్థానికులకు సమాచారం అందజేసింది. స్థానికులు తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే పవన్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు పవన్ మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: An employee commits suicide due to family quarrels

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page