కూడవెల్లి వాగు ప్రవాహిస్తుందని కలలో కూడా అనుకోలేదు:హరీష్ రావు

0 5

హైదరాబాద్  ముచ్చట్లు :
మండుటెండల్లో కూడవెల్లి వాగు ప్రవాహిస్తుందని కలలో కూడా అనుకోలేదని మంత్రి హరీష్ రావు అన్నారు. సాగునీరు గానీ, త్రాగునీరు గానీ 70ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీ వాళ్లు ఏనాడైనా ఇచ్చిండ్రా? అని ప్రశ్నించారు. ఈ సంవత్సరం భూమికి బరువయేంత పంట పండించేందుకు కృషి చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. బీహార్ నుంచి వచ్చి వ్యవసాయ పనులు చేసే స్థాయికి మన తెలంగాణ రాష్ట్రం చేరుకుందన్నారు. వాన చినుకు భూమిపై పడకముందే రైతు బంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. కరోనా సమయంలో కూడా ప్రభుత్వం రైతుకు కొండంత అండగా ఉందని పేర్కొన్నారు. అవసరమైతే మిగతా పనులు ఆపుతాం కాని రైతుకు మాత్రం అన్ని సంక్షేమ పథకాలు సరైన సమయంలో అందిస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఓపిక పట్టిన కార్యకర్తకు తప్పకుండా అవకాశం ఇస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు.

భర్తను కొట్టి చంపిన భార్య

 

- Advertisement -

Tags:Koodavelli did not even dream that the brook would flow: Harish Rao

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page