చౌడేపల్లెలో 5173 మందికి జగనన్న గోరు ముద్ద ద్వారా కందిపప్పు పంపిణీ

0 15

చౌడేపల్లె ముచ్చట్లు:

 

జగనన్న గోరు ముద్ద కార్యక్రమం ద్వారా మండలంలోని 77 పాఠశాలల్లో గల 5173 మంది విద్యార్థులకు కందిపప్పు పంపిణీ చేస్తున్నట్లు ఎంఈఓ కేశవరెడ్డి తెలిపారు. బుధవారం పెద్దకొండామర్రి పాఠశాలలో సర్పంచ్‌ జయసుధమ్మ ఆధ్వర్యంలో హెచ్‌ఎం చంద్రకళతో కలిసి కందిపప్పు ప్యాకెట్లను పంపిణీ చేశారు.1వతరగతి నుంచి 5వతరగతి వరకు 2721 మంది కి కానూ నాలుగన్నరకేజీల చొప్పున,6 వతరగతి నుంచి 10వతరగతి వరకు 2482 మందికి కానూ ఆరన్నరకేజీల చొప్పున పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మండలంలోని 5173 మంది కి కానూ 28,182 కేజీల కందిపప్పును పంపిణీ చేస్తున్నామన్నారు. ఆయా పాఠశాలల్లో హెచ్‌ఎంలు,ప్రజాప్రతినిథుల సమక్షంలో విద్యార్థులకు పంపిణీ చేస్తున్నామని, ఈ అవకాశాన్ని తల్లితండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు నాగభూషణరెడ్డి తదితరులున్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Distribution of soybeans by Jagannanna nail polish to 5173 people in Choudepalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page