జీతాలకే కేంద్ర నిధులు.. అభివృద్ది ఎక్కడ

0 20

నల్గోండముచ్చట్లు:

 

పల్లెల అభివృద్దే తెలంగాణ సర్కార్ ధ్యేయమని చెబుతున్న పాలకులు గ్రామ పంచాయితీ లకు ఒక్కరూపాయి కూడా ఇవ్వడం లేదు. 2020-2021 ఆర్ధిక సంవత్సరం పూర్తయినప్పటికీ స్టేట్ ఫైనాన్స్ నిధులు విడుదల కాకపోవడంతో గ్రామ సర్పంచులు ఆర్ధిక భారంతో మగ్గుతున్నారు. ప్రతి గ్రామ పంచాయితీకి నెలల వారిగా రావాల్సిన రాష్ట్ర నిధులు గత ఏడాది నుండి ప్రభుత్వం నిలిపివేయడంతో సర్పంచ్ లు నిధుల లేమి తో తర్జనభర్జనలు పడుతున్నారు. కేవలం 15వ ఆర్ధిక సంఘం నిధుల తో మాత్రమే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గ్రామ పంచాయితీ నిర్వహణ, సిబ్బంది వేతనాలు సైతం ఇవే నిధులు వాడుకోవాల్సిన దుస్థితి నెలకొంది.గ్రామ పంచాయితీ నిధులు తక్కవగా ఉండడంతో గ్రామ స్థాయిలో ఆశించిన రీతిలో అభివృద్ధి జరగడం లేదు.లక్షల రూపాయలతో సీసీ రోడ్లు,సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు చేసిన సకాలంలో బిల్లులు రాక అప్పు తెచ్చి చేసిన డబ్బులుకు వడ్డీలు చెల్లించలేకపోతున్నారు.ఎదురు పెట్టుబడి పెట్టి చేసిన పనులకు కూడా బిల్లులు రావడానికి నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా లో 461 గ్రామ పంచాయితీ లో మెజారిటీ గ్రామ పంచాయితీ సర్పంచ్ లు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు.ఎన్ఆర్జిఎస్ స్కీంలో చేసిన శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, నర్సరీలకు సైతం లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సకాలంలో బిల్లులు పొందలేక పోయారు. ఇప్పటికి పూర్తి స్థాయిలో శ్మశాన వాటిక లు నిర్మించిన సర్పంచ్ లకు సైతం బిల్లులు రాలేదు. నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయితీలకు భవనాలు లేక అద్దె భవనాల్లో నడుపుతున్నారు. నూతనంగా నిర్మించిన జీపీ బిల్డింగ్ భవనాలకు పూర్తి స్థాయిలో బిల్లులు రాలేదు. గ్రామ సర్పంచిగా ఎన్నికైనప్పటి నుండి నేటి వరకు ఏ ఒక్క పనికి డబ్భులు సరైన సమయంలో రాలేదు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Central funds for salaries .. Where development

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page