తిమింగలం వాంతి పేరుతో మోసం

0 21

హైదరాబాద్ ముచ్చట్లు :

ఒరిజినల్ అంబర్ గ్రిస్ (తిమింగలం వాంతి) స్థానంలో నకిలీ అంబర్ గ్రిస్‌ను తయారు చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కరోనా పరిస్థితుల కారణంగా చాలా మంది వ్యాపారస్తులు వ్యాపారంలో నష్టపోతున్న సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలోనే కొంతమంది వ్యాపారస్తులు మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న పలువురు వ్యాపారస్తులు అడ్డదారులు తొక్కుతున్నారు.ఒక కేజీ అంబర్ గ్రిస్ (తిమింగలం వాంతి) ధర మార్కెట్‌లో రూ.కోటి విలువ చేస్తుంది. దీన్ని పర్ఫ్యూమ్స్‌లో వాడతారు. సువాసన అధిక రోజులు ఉండడానికి ఈ అంబర్ గ్రీస్ కీలకం. విదేశాల్లో అంబర్ గ్రిస్ కోట్లలో వ్యాపారం జరుగుతుండడంతో సిటీ వ్యాపారులు దానిపై కన్ను వేశారు. హైదరాబాద్‌లో కూడా అంబర్ గ్రిస్ (తిమింగలం వాంతి) అమ్ముతున్నామంటూ అమాయకులను వలలో వేస్తున్నారు. నకిలీ అంబర్ గ్రిస్‌ను తయారు చేస్తున్నారు. ఖైరతాబాద్‌లోని ఒక గదిని అద్దెకు తీసుకొని దాన్ని అడ్డాగా మార్చుకొని అక్కడ ఈ నకిలీ అంబర్ గ్రిస్‌ను తయారు చేస్తున్నారు. వీటితో పాటు సులేమాన్ స్టోన్ సైతం ముఠా సభ్యులు విక్రయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా సులేమాన్ స్టోన్ చేతిలో పట్టుకుంటే చెయ్యి నరికిన కూడా తెగదు అంటూ ఈ ముఠా సభ్యులు అమాయకులైన జనాలను నమ్మిస్తున్నారుఅలాగే ఈస్టిండియా మ్యాగ్నెటిక్ ప్లేట్లు అంటూ మూఢనమ్మకం పేరుతో విక్రయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సుగంధ ద్రవ్యాలలో వాడే అంబర్ గ్రీస్ (తిమింగలం వాంతి) పదార్థం తమ వద్ద ఉందని నమ్మించి నకిలీ పదార్థాన్ని అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎలక్ట్రానిక్స్‌లో అతికించేందుకు వాడే గమ్ లాంటి పదార్థాన్ని అంబర్ గ్రిస్‌గా చూపిస్తూ వీరు మోసాలకు పాల్పడుతున్నారు. అయితే, సైఫాబాద్ పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే ఆ కార్యాలయంపై దాడి చేసి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.అరెస్టు చేసిన వారిలో షకీర్ అలీ (38) షేక్ అలీ (60) మహమ్మద్ ఆరిఫ్ (60) మహమ్మద్ నజీర్, మోహన్ లాల్ యాదవ్(57) మహమ్మద్ అజారుద్దీన్(33) మొహమ్మద్ హుస్సానుద్దీన్(51) అరెస్టు చేసి వారి వద్దనున్న నకిలీ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

- Advertisement -

భర్తను కొట్టి చంపిన భార్య

Tags:Cheating in the name of whale vomiting

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page