దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిళ్ల పంపిణి

0 12

జయశంకర్ భూపాలపల్లి  ముచ్చట్లు:
జిల్లాలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిళ్లను గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అందరి సంతోషం కోసం సీఎం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.అందులో భాగంగానే నేడు అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచారని చెప్పారు. దివ్యాంగులకు ఉన్న 500 రూపాయల పెన్షన్ ను 3000 కి పెంచి ఉపకరణాలు, ఉపాధి మార్గాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఈ రోజు బ్యాటరీతో నడిచే మూడు చక్రాల వాహనాలను దివ్యాంగులకు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ వాహనాలు తీసుకున్న 101 మందికి శుభాకాంక్షలు తెలిపారు.దివ్యాంగులకు విద్యలో రిజర్వేషన్లు ఇచ్చి, ఆర్థిక పథకాల్లో కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నారని మంత్రి తెలిపారు. అలాగే చైర్మన్ వాసుదేవ రెడ్డి దివ్యాంగులు అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తాడని తెలిపారు. ఏడేళ్ల కింద ఉన్న భూపాలపల్లికి సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఇప్పటి భూపాలపల్లికి పొంతన లేదు.నాటి స్పీకర్ మధుసూదనా చారి వంద పడకల హాస్పిటల్ తెచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని వసతులు అందుతున్నాయని పేర్కొన్నారు.ఈ జిల్లా ఇంచార్జీ మంత్రిగా ఇక్కడి సంక్షేమం, అభివృద్ధి కోసం నా వంతు సహకారం అందిస్తానని హామీనిచ్చారు.ఈ కార్యక్రమం అనంతరం జిల్లాలో వానాకాలం పంట కోసం ఎరువులు, విత్తనాల లభ్యత, కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ పై జిల్లా ప్రగతి భవన్ లో సమీక్ష చేశారు.కొవిడ్ తగ్గుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. వానాకాలంలో వచ్చే వ్యాధులు ప్రబలకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.వ్యవసాయ సీజన్ ప్రారంభం అయినందున కరెంట్ ఇబ్బందులు లేకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ జక్కుల హర్షిని, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అధికారులు పాల్గొన్నారు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

- Advertisement -

Tags:Distribution of battery powered tricycles to the disabled

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page