పార్టీల్లో కనిపించని విధేయత

0 12

హైదరాబాద్ ముచ్చట్లు:

కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు లాయల్టీ పదం ఎక్కువగా విన్పిస్తుంది. విధేయత అనే పదం ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకి వర్తించదు. 19 ఏళ్ల పాటు విధేయతగా ఉన్న ఈటల రాజేందర్ ను పార్టీ నుంచి పక్కన పెట్టేశారు. ఇక కాంగ్రెస్ లో వీరవిధేయులుగా ముద్ర పడిన కె.కేశవరావు, డి.శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, సుధీర్ రెడ్డి వంటి నేతలే టీఆర్ఎస్ లో చేరిపోయారు. సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు.పీసీసీ చీఫ్ పదవి భర్తీ చేసే సమయంలోనూ విధేయత మాట విన్పిస్తుంది. విధేయత అనే దానికి కొలమానమేది? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వవద్దని, పార్టీ విధేయులకే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ ఇప్పుడు కాంగ్రెస్  లో విన్పిస్తుంది. విధేయులుగా ఉన్న వారు అవకాశాలు లేక పార్టీలు మారలేదు.

 

- Advertisement -

వారికి జనాకర్షణ, ప్రజామోదం లేకనే ఇతర పార్టీలు కూడా ఆ నేతలవైపు చూడలేదు.అటువంటి వారిని పీసీసీ అధ్యక్షుడిగా చేస్తే ఏం ప్రయోజనం అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు ఢిల్లీ చేరుకున్నారు. త్వరలోనే పీసీసీ చీఫ్ పదవిని కాంగ్రెస్  అధినాయకత్వం భర్తీ చేస్తుందని తెలుస్తోంది. అయితే కేవలం విధేయతకే పెద్దపీట వేస్తే పార్టీ వచ్చే ఎన్నికల్లో కూడా పుంజుకోలేదన్నది అధిష్టానం భావన. సమర్థత, చరిష్మా ఉన్న నేతకే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని హైకమాండ్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.దీంతో రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి దక్కవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్ లో విధేయత అనే పదం ఊపందుకుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను నియమిస్తే తాము సహకరించబోమని కాంగ్రెస్ సీనియర్ నేతలు తెగేసి చెబుతున్నారు. వి.హనుమంతరావు వంటి నేతలయితే ఏకంగా హైకమాండ్ కు లేఖ రాశారు. మొత్తం మీద విధేయత అనే పదానికి ప్రస్తుత రాజకీయాల్లో అర్థం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ అధికారం ఉంటే నేతలు అటువైపు వెళతారు. ఈ పరిస్థితుల్లో పీసీసీ చీఫ్ గా ఎవరిని నియమిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Unseen loyalty at parties

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page