పుంగనూరులో అనుమానంతో అంతరాష్ట్ర దొంగను పట్టుకున్నాం- డిఎస్పీ గంగయ్య

0 283

-రూ.5.26 లక్షలు విలువ చేసే బంగారు, వెండి స్వాధీనం

 

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

వాహనాల తనిఖీలో అనుమానం వచ్చి వాహనాన్ని , వ్యక్తిని విచారించగా అంతరాష్ట్రదొంగను పట్టుకుని బంగారు, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పలమనేరు డిఎస్పీ గంగయ్య తెలిపారు. బుధవారం ఆయన సీఐ గంగిరెడ్డి, ఎస్‌ఐ ఉమామహేశ్వరరావుతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పట్టణానికి చెందిన సయ్యద్‌ అఫ్సర్‌ (32) వెల్డింగ్‌ పని చేస్తూ ఉన్నారు. ఇతడు కర్నాటకలోని వివిధ ప్రాంతాలలో 20 చోరీ కేసుల్లో నింధితుడిగా ఉన్నాడు. ఇలా ఉండగా మంగళవారం సాయంత్రం సీఐ గంగిరెడ్డి, ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు అరవపల్లె వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనంపై అఫ్సర్‌ వచ్చి పారిపోవడానికి ప్రయత్నించడంతో పట్టుకుని విచారించామన్నారు. విచారణలో పట్టణంలోని 7 ఇండ్లలో చోరీలకు పాల్పడినట్లు తెలపడంతో అతని వద్ద నుంచి 94 గ్రాముల బంగారు, 633 గ్రాముల వెండి, రూ.70 వేలు నగదు, రెండు టీవిలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ రూ.5.26 లక్షలని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండుకు తరలించామన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Interstate thief caught on suspicion in Punganur- DSP Gangaiah

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page