పుంగనూరులో ఆస్తి,చెత్త పన్నుల జీ.వో లను రద్దు చేయాలని సిఐటియు వినతి

0 20

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్ర అధికారులు జీ.వో నెంబర్ 196,197,198 లను విడుదల చేశారు.ఈ జీ.వోల వలన ఆస్తి పన్ను రిజిస్ట్రేషన్ ఆధారంగా పెరుగుతుందని అన్నారు.కొత్తగా చెత్త మీద పన్ను వేయడం జరుగుతుందని,చెత్త మీద పన్ను వేయటం ఏమిటని బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు బాగంగా సచివాలయంలో వినతిపత్రం ఇస్తూ సిఐటియు పుంగనూరు అధ్యక్షురాలు ధనలక్ష్మి ప్రశ్నించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూవివిధ రకాల పనులకు యూజర్ చార్జీలు వేయడం వలన ఈ ప్రభుత్వం యొక్క దోపిడి విధానాలను బట్టబయలుగా చేస్తోందని అన్నారు. వీటివలన ప్రజలపై అదనపు భారాలు పడుతుందని తెలియజేశారు. వైయస్సార్ పార్టీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలకు భిన్నంగా ఈ జీ.వోలు ఉన్నాయని విమర్శించారు.కరోనా మహమ్మారి వలన ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవిస్తుంటే ప్రజల పై ఇటువంటి భారాలు మోపడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతుండగా ఈ విధంగా పన్నుల భారం వేయడం సరైందికాదని అన్నారు.ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన స్థానిక సంస్థలకు పన్నుల విధానం నిర్ణయించుకునే అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే పన్నుల విధానం ప్రకటించడం అప్రజాస్వామికమని,ఇటువంటి అప్రజాస్వామిక చర్యలను వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: CITU requests cancellation of property and garbage tax GOs in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page