పూర్తయిన జైలు కూల్చివేత

0 25

వరంగల్   ముచ్చట్లు:
వసెంట్రల్ జైల్ కూల్చివేత దాదాపు పూర్తయ్యింది.  జైలు భవనాల ఒక్కొక్కటిగా నేలమట్టం అవుతున్నాయి. కూల్చివేసిన శిథిలాలను తరలిస్తున్నారు. సెంట్రల్  జైల్ తరలించి… ఇక్కడ  సూపర్ స్పెషాలిటీ  హాస్పిటల్ నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. దీంతో కూల్చివేతలు సీక్రెట్ కొనసాగుతున్నాయి. ఎవరిని లోపలికి అనుమతించటం లేదు.వరంగల్ సెంట్రల్ జైల్… అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించిన జైళ్ళల్లో ఒకటి. నిజాం ప్రభుత్వంలో హన్కిన్ …జైళ్ల శాఖ అధిపతిగా బాధ్యతలు చేపట్టాక 1885 లో వరంగల్ సెంట్రల్ జైలును నిర్మించారు. భద్రతా వ్యవస్థతో పాటు పరిశుభ్రత, ఖైదీల్లో పరివర్తనకు మారుపేరుగా నిలిచిన వరంగల్ సెంట్రల్ జైల్ ఇప్పుడు కనుమరుగైంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం సెంట్రల్ జైల్ ను ఖాళీ చేశారు. భనవనాల కూల్చివేత ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది.మే 21 సీఎం కేసీఆర్ వరంగల్ MGM హాస్పిటల్ కోవిడ్ వార్డు, సెంట్రల్ జైల్ ను సందర్శించారు. ఈనెల1 నుంచి ఖైదీల తరలింపు ప్రారంభమైంది. 15 రోజుల్లో స్థలాన్ని వైద్య ఆరోగ్యశాఖకు అప్పగించాలని పెట్టుకున్న టార్గెట్ కంటే ముందే అధికారులు ఖాళీచేశారు. ఈనెల 11 నాటికే సెంట్రల్ జైలు ఖాళీ చేసి… స్థలాన్ని వైద్య ఆరోగ్యశాఖకు అప్పగించారు.

 

అదే రోజు అర్థరాత్రి నుంచి కూల్చివేతలు మొదలయ్యాయి. వరంగల్ జైలు కూల్చివేత ప్రక్రియలో అధికారుల సీక్రెసీపై విమర్శలు వస్తున్నాయి. మీడియాను కూడా అనుమతించకుండా జైలు గేట్లు మూసేసి భారీ పోలీస్ పహారా మధ్య కూల్చివేతలను వేగంగా జరుపుతున్నారు. ఇప్పటికే  24 భారీ యంత్రాలతో బిల్డింగ్స్ కూల్చివేశారు. సెంట్రల్ జైల్ కూల్చివేసిన స్థలంలో ఈ నెల 21 సీఎం కేసీఆర్  మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు శంకుస్థాపన చేయనున్నారు. 63 ఎకరాల  స్థలంలో 24 అంతస్తులతో నిర్మించే హాస్పిటల్ లో అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామని సర్కార్ ప్రకటించింది. కెనడా తరహాలో గాలి, వెలుతురు ప్రసరించేలా క్రాస్  వెంటిలేషన్  పద్ధతుల్లో నిర్మించాలని ఇప్పటికే సీఎం అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అక్కడి నిర్మాణాలపై అధ్యయనం చేసేందుకు వైద్యాధికారుల బృందాన్ని కెనడా పంపనున్నారు. సీఎం టూర్ ఖరారవడంతో సెంట్రల్ జైల్ కూల్చివేతలు, శిథిలాల తొలగింపు స్పీడప్ చేశారు అధికారులు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Completed prison demolition

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page