పేద లందరికి ఇళ్లు క్రింద మొదటి  విడత లో మంజూరు

0 7

కడప ముచ్చట్లు:

 

నవరత్నాలు – పేద లందరికి ఇళ్లు క్రింద మొదటి  విడత లో మంజూరు చేసిన గృహాలన్ని త్వరితగతిన  గ్రౌండింగ్ పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, జేసిలు, అధికారులు ఈ వీసీలో పాల్గొన్నారు. ఇందులో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ల పురోగతి, కోవిడ్-19, ఎన్ఆర్ఈజిఎస్ పనులు, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్ లు,బియంసియులు,అంగన్వాడి కేంద్రాలు, ఖరీఫ్ సీజన్ సన్నద్ధత తదితర8 అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించి లక్ష్యసాధనకు దిశానిర్దేశం చేశారు.

 

 

 

- Advertisement -

వి.సి. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా
పెదలందరికి సొంతింటి కలను నిజం చేయడంలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.  ఇందుకు గృహ నిర్మాణాల మ్యాపింగ్, జియో టాగింగ్, రిజిస్ట్రేషన్, జాబ్ కార్డ్స్ ఎంరోల్మెంట్ పనిలను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.  ఇందుకు మున్సిపల్ , మండల స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీలు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రభుత్వ శాఖలన్ని సమన్వయంతో పని చేసి కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు,   వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్ లు, బియంసియు లపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్య సాధనకు  కృషి చేయాలన్నారు. అనంతరం వివిధ అంశాలపై కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Granted in the first installment under the house to all the poor

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page