ప్రకాష్ గౌడ్ మరణం బిజెపి పార్టీకి తీరని లోటు -కిషన్ రెడ్డి

0 14

హైదరాబాద్ ముచ్చట్లు:

 

మద్యతరగతి నుండి వచ్చి పేదప్రజలు,బస్తీ ప్రజలతో మమేకమై ఎన్నో ఏళ్ళుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రకాష్ గౌడ్ మరణం బిజేపి పార్టీకి తీరని లోటని కేంద్ర హోంశాఖ సహయమంత్రి కిషన్ రెడ్డి,బిసి మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈరోజు
ముషీరాబాద్ నియోజకవర్గం బిజేపి నాయకులు ప్రకాష్ గౌడ్ జయంతి సందర్భంగా అడిక్ మెట్ డివిజన్ కార్పోరేటర్ సునితా ప్రకాష్ గౌడ్ ఆద్వర్యంలో డివిజన్ లోని పలు ప్రాంతాలలో సహపంక్తి బోజనాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన కిషన్ రెడ్డి,లక్ష్మణ్ లు మాట్లాడుతూ గతంలో కార్పోరేటర్ గా అడిక్ ప్రాంత అభివృద్ధికి అంకిత భావంతో క్రుషిచేసిన వ్యక్తి ప్రకాష్ గౌడ్ అని కొనియాడారు.వారి సతిమణి సునితా ప్రకాష్ గౌడ్ గెలిచిన కొద్దిరోజుల్లోనే ఆయన మరణించడం జీర్ణించుకోలేని విషయమని ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన భాద్యత మనందరిపై ఉందని అన్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Prakash Gowd’s death is a fatal blow to BJP – Kishan Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page