బాబాయ్ వర్సెస్ అబ్బాయ్

0 24

పాట్నా   ముచ్చట్లు:
బీహార్‌లోని లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జెపి)కి చెందిన ఆరుగురు ఎంపిలలో ఐదుగురు తమ నాయకుడు చిరాగ్ పాశ్వాన్‌పై రాత్రికి రాత్రే తిరుగుబావుటా ఎగురవేవారు. లోక్‌సభలో పార్టీ పక్షనేతగా ఉన్న చిరాగ్ స్థా నంలో ఆయన చిన్నాన్న పశుపతి కుమార్ పారస్‌ను(దివంగత రాంవిలాస్ పాశ్వాన్ తమ్ముడు) ఎన్నుకున్నారు. లోక్‌సభలో తమను వేరే బృందంగా గుర్తించాలని కో రుతూ స్పీకర్‌కు లేఖ కూడా రాసినట్లు విశ్వసనీయ వర్గా లు తెలిపాయి. తమ బృందానికి పశుపతిని నేతగా ఎన్నుకున్నట్లు ఎల్‌జెపి ఎంపీలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. జెడి(యు) అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను తీవ్రంగా విమర్శిస్తున్న చిరాగ్ పాశ్వాన్‌తో పొసగకనే ఈ ఐదుగురు ఎంపిలు ఈ చర్యకు పూనుకున్నట్లు తెలుస్తోంది.ఎల్‌జెపి నాయకునిగా ఎన్నికైన అనంతరం పశుపతి కుమార్ పారస్ సోమవారం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ను మంచి నాయకునిగా, వికాస్ పురుష్‌గా అభివర్ణించడం విశేషం.

 

పార్టీని తాను చీల్చినప్పటికీ దాన్ని కాపడానని హాజీపూర్ నుంచి ఎంపిగా లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పారస్ విలేకరులకు తెలిపారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కు వ్యతిరేకంగా ఎల్‌జెపి పోటీ చేసి పార్టీ ఓటమికి కారకుడైన చిరాగ్ పాశ్వాన్‌పై పార్టీ కార్యకర్తలలో 90 శాతం మంది అసంతృప్తిగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎలో తమ గ్రూపు కొనసాగుతుందని, చిరాగ్ పాశ్వాన్ పార్టీలో ఉండవచ్చని ఆయన చెప్పారు. తమ నిర్ణయాన్ని లోక్‌సభ స్పీకర్‌కు తెలియచేశామని ఐదుగురు ఎంపీలు తెలిపారు. కాగా, తాజా పరిణామాలపై పాశ్వాన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.ఎల్‌జెపిలో నెలల క్రితమే అంతర్గత విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబరులో చిరాగ్ తండ్రి, రామ్‌విలాస్ పాశ్వాన్ హఠాణ్మనరణం చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చిరాగ్, పశుపతి మధ్య విభేదాలు వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. రామ్‌విలాస్ చనిపోయిన నాలుగు రోజుల తర్వాత ఓ ప్రకటన విషయమై పశుపతి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన చిరాగ్, ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తానని హెచ్చరించినట్లు తెలుస్తోంది. మరోవైపు చిరాగ్‌పై తిరుగుబాటు చేస్తోన్న ఐదుగురు ఎంపిలు త్వరలోనే జెడియులో చేరొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. పశుపతికి కేంద్రమంత్రి పదవి ఇప్పిస్తానని నితీశ్ హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అప్పట్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాసవాన్ నిర్ణయం నితీశ్ కుమార్‌కు భారీ నష్టం కలిగించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగి ఎల్‌జెపి ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో జేడీయూ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే నితీశ్.. పశుపతికి సాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Baba vs Abbay

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page