బీజేపీ ధర్నా

0 7

నందికొట్కూరు ముచ్చట్లు :

మున్సిపల్  కార్యాలయం ముందర రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి,  రాష్ట్ర బీజేవైఎం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి అమ్మ ఆదేశాల మేరకు బిజెపి నందికొట్కూరు నియోజకవర్గ ఇంచార్జ్ కొండేపోగు చిన్న సుంకన్న ఆధ్వర్యంలో ఆస్తిపన్ను ఇంటి పన్ను అలాగే చెత్త పన్ను రూపంలో అధిక మోతాదులో పన్నులు విధించడం సరైనది కాదని నందికొట్కూరు బిజెపి నియోజకవర్గ సమన్వయకర్త కొండేపోగు చిన్నసుంకన్న ఖండించారు. అలాగే ఆయన మాట్లాడుతూ పన్నులను తక్కువగా   చేయాలని కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో పన్నులు విధించడం చాలా దురదృష్టకరమని, ప్రజలు బతకడం చాలా కష్టంగా ఉందని, ఆయన పేర్కొన్నారు .అలాగే ఇలాంటి పన్నులు వసూలు చేస్తే బిజెపి రాష్ట్ర పిలుపుమేరకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజల పక్షాన నిలబడి నిలుస్తామని ఆయన పిలుపునిచ్చారు. తర్వాత  మున్సిపల్ ఆఫీసు నందు ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం మెమోరాండం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్ల దామోదర్ రెడ్డి గారు,బీజేవైఎం నాయకులు వెంకటేష్  ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

భర్తను కొట్టి చంపిన భార్య

 

Tags:BJP dharna

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page