బొందిమడుగుల గ్రామ పంచాయతీలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

0 8

తుగ్గలి ముచ్చట్లు:

 

తుగ్గలి మండల పరిధిలోని బొందిమడుగుల గ్రామపంచాయతీ నందు ఏర్పాటు చేసిన వైఎస్సార్ సుజల మినరల్ వాటర్ ప్లాంట్ ను బుధవారం రోజున బొందిమడుగుల సర్పంచ్ చౌడప్ప మరియు పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు ప్రారంభించారు.గ్రామీణ ప్రాంతాలలో నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు శాశ్వత పరిష్కారం లభించిందని నాయకులు,అధికారులు తెలియజేశారు. వైయస్సార్ సుజల వాటర్ ప్లాంట్ ద్వారా నాలుగు రూపాయలకు 20 లీటర్ల మినరల్ వాటర్ ను అందజేస్తున్నట్లు వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బి.వెంకటారముడు,టి.ఎం రమేష్,బీమా నాయక్,ఎస్.మాబు,వి.నాగరాజు,టి.గోపాల్,టి. శీను,రంగస్వామి,బాలమద్ది,ప్రతాప్ యాదవ్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Commencement of Mineral Water Plant in Bondimadugula Grama Panchayat

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page