మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు ద్వారా  30 రోజులుగా కొనసాగుతున్న  అన్నదానం  

0 13

వేములవాడ  ముచ్చట్లు:

మై వేములవాడ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలలో భాగంగా బుధవారంవారం 30వ రోజుకు చేరాయి. ఈరోజుహోమ్ ఐసోలేషన్ లో ఉన్న కొవిడ్ పేషంట్లకు, మరియూ వైద్య సిబ్బందికి లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ వద్ద గల కొవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న పేషంట్లకు , ఆరోగ్య సిబ్బందికి ఆలయ పరిధిలో ఉంటున్న అన్నార్థులకు మొత్తం100 మందికి అన్నదానం చేయడం జరిగింది . లక్మి గణపతి కాంప్లెక్స్ నందు ఉన్న కరోనా పేషంట్లకు 15 రోజులు పూర్తి అయినందున ఈరోజు వారిని మధ్యాహ్నం భోజనం అనంతరం ఐసోలేషన్ నుండి డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జి అయిన పేషంట్లకు ట్రస్ట్ సభ్యులు గో కరోనా అనుకుంటూ బొకేలతో, చప్పట్లతో  పేషంట్లకు సెండాఫ్ ఇవ్వడం జరిగింది. ఐసోలేషన్ ఇంచార్జ్ డాక్టర్ గౌస్ గారు, డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది మీ సేవలు మారువలేనివి అని కొనియాడారు. అనంతరం వైద్య సిబ్బందిని కూడా శాలువాతో సత్కరించి బొకే అందజేయడం జరిగింది. ఐసోలేషన్ నుండి పేషంట్లు వెళ్లినా అదే స్థలంలో పేదలకు, యాచకులకు ప్రతీరోజు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో అన్నదానం ఇలాగే కొనసాగుతుందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కుమ్మరి శంకర్, మధు మహేష్, తాళ్లపెళ్లి ప్రశాంత్, నూగురి మహేష్, నాగుల చంద్రశేఖర్, బెజ్జంకి రవీందర్, తాటికొండ పవన్,  కొప్పుల హన్మాండ్లు, రంగుల శ్రీనివాస్, రాజిరెడ్డి, ప్రతాప నటరాజు, అవునూరి భాస్కర్, వొడ్నల వేణు, బెజ్జంకి రవీందర్, కపిల్ శ్రీనివాస్, జగదాంబ గణేష్, ముంజ రమేష్, ముంజ ఉమెందర్, కొప్పుల హన్మాండ్లు, భస్మాంగి బస్వరాజు,  తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Donation for 30 days by My Vemulawada Charitable Trust

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page