యువతిని ప్రేమించి పెళ్లాడుతానని మోసం చేసిన మెప్మా ఉద్యోగి  కార్యాలయం ముందు ఏఐవైఎఫ్ ధర్నా

0 9

నెల్లూరు  ముచ్చట్లు :
ఫాజిల అనే యువతిని ప్రేమించి పెళ్లాడుతానని మెప్మా ఉద్యోగి షాకీర్ మోసం చేశాడని ,ఆ యువతికి న్యాయం జరగాలని  మెప్మా ఆఫీస్ వద్ద  ఏఐవైఎఫ్ నాయకులు బుధవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ సయ్యద్ సిరాజ్ మాట్లాడుతూ, మెప్మా ఉద్యోగి షాకీర్, ఫాజిల  అనే యువతి వెంటపడి ప్రేమించానని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని తన పెద్ద వారిని కూడా తీసుకు వచ్చి మాట్లాడించి, ఆ అమ్మాయిని గర్భవతిని చేసి వదిలేయడం సమంజసం కాదని తన ఆవేదన వ్యక్తపరిచారు. అప్పటి నుంచి ఆమెను మాయమాటలతో మభ్యపెడుతూ కాలం వెళ్లబుచ్చారు అని ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వడం జరిగిందన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికి 3 నెలల బాబు ఉన్నాడు అని తెలిపారు.అయితే షాకీర్ కి ఇంతకుముందే పెళ్లి అయ్యి ,ఒక కొడుకు  ఉన్నాడు అని తెలుస్తుంది అన్నారు.ఆ విషయాన్ని దాచిపెట్టి వాళ్ళ పెద్ద వాళ్ళు అందరూ కలిసి, ఈ అమ్మాయిని దారుణంగా మోసం చేయడం తగదన్నారు.ఈ అమ్మాయికి తగిన న్యాయం జరిగే వరకూ పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో షాన్ వాజ్, మున్నా, ముక్టియార్, నూర్ ఖాన్,రఫీ,గౌస్, దస్తగిరి,షబ్బీర్ తదితరులు పాల్గొన్నా.

 

భర్తను కొట్టి చంపిన భార్య

 

- Advertisement -

Tags:Mepma employee who cheated on a young woman he fell in love with and married
AIYF dharna in front of office

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page