యూఎస్‌లో త‌మ‌న్ సంగీతం సార‌థ్యంలో అతిపెద్ద మ్యూజికల్ కార్నివాల్  ‘అలా అమెరికాపురములో..

0 6

`హైదరాబాద్‌ ముచ్చట్లు:

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఆగస్ట్‌, సెప్టెంబర్ నెల‌ల‌లో యునైటెడ్ స్టేట్స్ లో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డి.సి., చికాగో, న్యూజెర్సీ, శాన్ జోస్ మరియు డల్లాస్ లో  ప్రత్యక్ష ప్రదర్శనలు ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా యూఎస్‌లో  ‘అలా అమెరికాపురములో’ పేరుతో హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఏర్పాటు చేసిన అతి పెద్ద మ్యూజిక‌ల్ కార్నివాల్ లో పాల్గొన‌నున్నారు. తమన్ బృందంలో శివమణి, నవీన్, ఆండ్రియా జెరెమియా, శ్రీ కృష్ణ, పృథ్వి చంద్ర, హరిక నారాయణ్, శ్రుతి రంజని, మనీషా, రోషిని, శాండిల్య, జోబిన్ డేవిడ్, సుభాశ్రీ, రాకేశ్ చారి, ఓషో వెంకట్, సిద్ధాంత్‌, ష‌దాబ్ రాయిన్ వంటి ప్రతిభావంతులైన ప్రదర్శనకారులు ఉన్నారు. ఈ కాన్స‌ర్ట్‌కు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మరియు స్టార్ హీరో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. చాలా మంది స్టార్ హీరోయిన్లు, మరియు ఇతర సినీ ప్రముఖులు తమన్‌తో కలిసి ప్రదర్శనలు ఇవ్వ‌నున్నారు. రష్యన్, బెలారస్ నృత్యకారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక కళాకారులు వారి పెర్‌ఫామెన్స్‌ల‌తో ఈ ఈవెంట్ ప్ర‌త్యేకంగా చేయ‌నున్నారు. హంసిని ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ వారు గ‌తంలో `ARR లైవ్ ఇన్ కాన్సర్ట్ 2017 లండన్` మరియు `అనిరుధ్ లైవ్ ఇన్ కన్వర్ట్ లండన్ అండ్ పారిస్ 2018` వంటి భారీ సంగీత కార్యక్రమాలను నిర్వహించారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:The largest musical carnival in the US, led by Tyman Music, ‘in America ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page